Home News Stories

చంద్రబాబు అమెరికా పర్యటనలో ఏం జరిగింది…?

సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన మొత్తం సమావేశాలు, ఒప్పందాలు, భేటీలకే పరిమితమైందా….? లేక ఇంకేమైనా జరిగిందా….? ఆయన అమెరికా ట్రిప్‌ సందర్భంగా ప్రయాణ సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికరమైన అంశాలేంటి? నాలుగు రోజుల అమెరికా పర్యటనలో చంద్రబాబు ఏం సాధించారు.


అమెరికా పర్యటనలో భాగంగా ఈనెల 22న చంద్రబాబు హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్ళగా 23వ తేదీ మధ్యాహ్నం మావోయిస్టులు ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరిసోమలను కాల్చి చంపారు. ఈ సమయంలో సీఎం ఫ్లైట్ లోనే ఉన్నారు. సంఘటన జరిగిన కొద్ది నిమిషాలకే ముఖ్యమంత్రి తాజా పరిస్థితిపై విమానంలోనే సమీక్షించినట్లు…, దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు సీఎంవో కార్యాలయం ప్రకటనలు జారీ చేసింది… విమాన ప్రయాణంలో ఉన్న సీఎంకి ఈ విషయాలు ఎలా తెలుస్తాయి….? ఏదో ఇవ్వాలి కాబట్టి సీఎం కార్యాలయ వర్గాలు సీఎం పేరు మీద ప్రకటనలు జారీ చేశారని భావించారంతా…..లేపోతే సీఎం కాబట్టి ఏదైనా శాటిలైట్ ఫోన్ ఉండి ఉండవచ్చు .. దాంతో సమీక్ష చేసి ఉంటారని ఇంకొందరు భావించారు… అయితే ఆయన ఆ ఘటన సమాచారం తెలుసుకుని అందరితోను మాట్లాడింది సాధారణ సెల్ ఫోన్ తోనేనట..

ఆయన ప్రయాణించిన విమానం ఎయిర్ బస్ కి చెందిన ఎ 380… డబల్ డెక్కర్ విమానమైన ఇందులో వీఐపీలు ప్రయాణించే బిజినెస్ క్లాస్ లో ఇంటర్నెట్ సౌకర్యం వెసులుబాటు ఉటుంది.. 50డాలర్లు చెల్లిస్తే 500ఎంబీ సదుపాయం కల్పిస్తారు… ముఖ్యమంత్రితో ప్రయాణించే సిబ్బంది ఆ నెట్ సౌకర్యం తీసుకున్నారట.. దాంతో మావోయిస్టుల ఘటన జరిగిన కొద్దిసేపటికే సమాచారం నేరుగా చంద్రబాబుకు అందింది. ..వాట్సప్ కాల్ సాయంతో వెంటనే ఆయన జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడగలిగారు.

అమెరికాలో అడుగుపెట్టే వరకూ విమాన ప్రయాణంలోనే శాంతిభద్రతలపై ఉన్నత స్థాయి సమీక్షలు కొనసాగించి క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు… పోలీసు స్టేషన్ ల పై స్థానికులు దాడి చేసిన విషయాన్ని తెలుసుకుని ఎలాంటి ప్రతి చర్య చేయవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు అక్కడి నుంచే హోంశాఖకు జారీ చేశారట.. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు న్యూయార్క్ నగరంలోని గ్రాండ్ హయత్ హోటల్ లో సమావేశo లో పాల్గొన్నారు… అదే హోటల్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాటు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలు ఉన్నారట… ట్రంప్ తో పాటు హసీన, ముఖ్యమంత్రి చంద్రబాబులకు హోటల్ పై అంతస్తులోనే గదులు కేటాయించారు. … సీఎం ను కలిసేందుకు పెద్దఎత్తున ప్రవాసాంధ్రులు హోటల్ కు తరలి రావడాన్ని.. హోటల్ సిబ్బంది ఆసక్తిగా గమనించారట.

ఇక ప్రపంచ ఆర్థిక వేదికలో పాల్గొనేందుకు సీఎం వెళ్లే సమయంలో మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుందట.. ఆ వేదిక సీఎం బస చేసిన హోటల్ కు 2కిలోమీటర్ల దూరంలోనే కార్యక్రమం ఉన్నా… హోటల్‌ దగ్గర 4 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ గంటల పాటు స్తంభించిపోయింది. .. దాంతో కార్యక్రమానికి వెళ్లలేని పరిస్థితి. ….ఆ ప్రదేశంలో ఈ తరహా ట్రాఫిక్ జామ్ కొత్తకాదు అని తెలుసుకుని సీఎం ఆశ్చర్యపోయారట…

అమెరికా ఎంత అభివృద్ధి చెందినా ఇన్నేసి గంటల ట్రాఫిక్ జామ్ ను ఎవరూ సకాలంలో సరిదిద్దలేకపోవటాన్ని అంతా ఆసక్తిగా చర్చించుకున్నారట… ఆనాటి ప్రపంచ ఆర్థిక వేదిక కార్యక్రమం ఇక దాదాపు రద్దైనట్లేనని అంతా భావిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కాలినడకనే వేదిక వద్దకు వెళ్లేందుకు సిద్దమయ్యారు… దీంతో అంతా సీఎంను అనుసరించి తేలిక పాటి వర్షం పడుతున్నా అమెరికా వీధుల్లో గొడుగులు పట్టుకుని నడుస్తూ వేదిక వద్దకు సకాలంలో చేరుకున్నారు. .. అక్కడి నుంచి సమీపంలోనే మరో కార్యక్రమం ఉండటంతో అక్కడికీ కాలనడకనే వెళ్లారట సీఎం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here