దేశంలో కరోన కల్లోలం సృష్టిస్తుంది. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండటం..సెకండ్ వేవ్ వేరియంట్ ప్రమాదకరంగా మారడంతో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. కోవిడ్ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.కరోనా బాధితులు 3 పొరల మాస్క్ ధరించాలని పేర్కొంది. లక్షణాలు ఉన్నా లేకపోయినా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండటం మంచిదని సూచించింది. దీర్ఘకాలిక వ్యాధులు బీపీ, షుగర్ ఉన్నవారు వైద్యుల సలహా పాటించాలని తెలిపింది.

ఈ ఆపత్కాలంలో ఎక్కువగా నీరు, ద్రవ ఆహారం తీసుకోవాలని ప్రజలకు సూచించింది. ఆక్సిజన్ స్థాయిలు ఎప్పటికప్పుడు పరిశీలించుకుని తగిన వ్యాయామం చేయాలని సూచించింది. ఇక కరోనా సోకి ఐసోలేషన్ లో ఉన్నవారు ట్రీట్మెంట్ పూర్తై పది రోజుల తర్వాత బయటకు రావొచ్చని పేర్కొంది. జ్వరం దగ్గు ఇతర సమస్యలు లేకపోతే కరోనా నుంచి కోలుకున్నట్లే అని మళ్లీ టెస్టు అవసరం లేదని సూచించింది.