Entertainment
కమల్ హాసన్ నామ రహస్యమేంటి?
కమల్ హాసన్ హిందువా? ముస్లిమా? ఇప్పుడిదో హాట్ టాపిక్. అదేంటి కమల్ తమిళ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాడు కదా? మరి ఈ డౌటేంటి? తండ్రి పేరు శ్రీనివాస అయ్యర్. లాయర్. మరి పేరులో ఈ హాసన్ అన్న ముస్లిం శబ్ధం ఎక్కడిది? మాములుగా ఇలాంటి పేర్లు పెట్టుకునేది ముస్లిములు. కానీ కమల్ హాసన్, చారు హాసన్, సుహాసినీ ఈ పేర్లలోని ముస్లిం శబ్ధమేంటి? అన్నది అందరినీ తొలచి వేస్తున్న ప్రశ్న. దీనంతటికీ కారణం కమల్ హాసన్ కి మన హిందూ సంస్కృతీ...
ఎక్కడి హీరోలక్కడే గప్‌చుప్..
టాలీవుడ్ భారతంలో శ్రీరెడ్డి మొదలుపెట్టిన వివస్త్రపర్వంతో ఇండస్ట్రీ షేకైపోయింది. ఫిల్మ్‌నగర్ కేంద్రంగా నమోదైన భూకంపంతో పెద్దోళ్ల బిల్డింగులు బీటలువారతాయేమోనని భయపడే పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుతానికి ప్రకంపనలు కాస్త తగ్గినా పూర్తిగా సైడైపోతే బాగోదని అప్పుడప్పుడై రాళ్లు విసురుతూనే ఉంది అందరి బతుకులూ బజారుకు లాగుతానంటున్న శ్రీరెడ్డి. శ్రీరెడ్డి పవన్‌కళ్యాణ్‌ని గోకేదాకా ఇండస్ట్రీలో పెద్దలెవరూ పట్టించుకోలేదు. ఎప్పుడైతే పవన్కళ్యాణ్మీద నోరుపారేసుకుని..చివరికి ఇంట్లో ఉండే ఆయన తల్లిని కూడా శ్రీరెడ్డి తిట్టేసిందో అప్పుడే అందరికీ పౌరుషం పొడుచుకొచ్చేసింది. జీవితారాజశేఖర్ లైన్లోకొస్తేగానీ తెలుగుసిన్మా పరిశ్రమ పెద్దలు పెదవులు...
వర్మ బ్రోకర్..మధ్యలో జోకర్!
టాలీవుడ్‌ని గబ్బు పట్టించిన శ్రీరెడ్డి బట్టలిప్పి బజార్న పడటానికి ముందే ఆమెకు మద్దతుగా ఒకే ఒక దర్శకుడు ముందుకొచ్చాడు. ఆమెకు రెండు సిన్మాల్లో ఛాన్సిస్తానన్నాడు. ఎవరో అల్లాటప్పా డైరెక్టర్ కూడా కాదు. ఈమధ్యే నేనే రాజు..నేనేమంత్రి సిన్మాతో ఓ గట్టి హిట్ కొట్టి ఫామ్‌లో ఉన్న తేజ. ఆ దర్శకుడికి ఎంత విశాల హృదయమో అనుకున్నారు. ఏంచేసినా శ్రీరెడ్డి అతని రుణం తీర్చుకోలేదని కూడా అనేసుకున్నారు. కానీ నేనున్నానని ముందుకొచ్చిన తేజని కూడా బకరాని చేసేసింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి పవన్‌కళ్యాణ్‌తో పాటు ఆయన తల్లిని...
అడుసు తొక్కనేల..
బీజేపీకి ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు కొందరు నాయకులు కొత్త వివాదాలు కొనితెస్తున్నారు. జాత్యహంకారంతో మిడిసిపడే ఆస్ట్రేలియావాడో, తెల్లతోలు అమెరికావాడో మనల్ని తక్కువ చేసి మాట్లాడితేనే బాధపడతాం. అలాంటిది మన రంగును మనమే చులకన చేసుకుంటే ఎలాగన్న స్పృహ లేకపోయిందా సీఎంకి. అదృష్టం కలిసొచ్చి త్రిపుర ముఖ్యమంత్రి అయిన బిప్లబ్‌కుమార్‌దేబ్...రాష్ట్రంలో తన ముద్ర ఎలా వేయాలో చూసుకోకుండా తను కూడా వివాదంలో ఉండాలని ముచ్చటపడుతున్నట్లున్నాడు. ఆ మధ్య ఓ ప్రోగ్రాంలో నోరుపారేసుకున్నాడు త్రిపుర సీఎం. ఐశ్వర్యారాయ్‌కి ప్రపంచ సుందరి కిరీటం వచ్చిందంటే ఆమె అద్భుత సౌందర్యరాశికాబట్టి....
వాడుకుని వదిలేయడంలేదుగా..
క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ షేక్ అవుతున్న వేళ...పెద్ద పెద్ద నటులే ఈ గొడవ మనకెందుకనో..మనం ఆ రొంపికి దూరంగా ఉన్నామనో ఎవరికి వారు మౌనంగా ఉన్న సమయంలో మహిళై ఉండీ ధైర్యంగా ముందుకొచ్చింది జీవితా రాజశేఖర్. నానాయాగీ చేస్తున్న శ్రీరెడ్డి మొహంమీద కొట్టేలా సమాధానం ఇవ్వడమే కాదు..ఈ క్యాస్ట్ కౌచింగ్కి ఏ రంగం మినహాయింపంటూ సూటిగా ప్రశ్నించింది. నిజమే...పాలిటిక్స్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీదాకా సూక్ష్మ పరిశోధన మొదలుపెడితే గొంగట్లో వెంట్రుకలేరుకున్నట్లే. ఆ మాటకొస్తే చిన్న పాయింట్ దొరికితే చించి చేటచేసే మీడియాని...
`కణం`తో ఎమోషనల్ కనెక్షన్
నాగశౌర్య, సాయిపల్లవి నటించిన చిత్రం ‘కణం’. ఎన్.వి.ఆర్ సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సినిమాను నిర్మించింది. విజయ్ దర్శకుడు. సినిమా ఏప్రిల్ 27న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సాయిపల్లవి ఈ సిన్మా అనుభవాల్ని పంచుకుంది. తన తల్లికోసమే ఈ సిన్మా చేశానని చెప్పుకుంది. దర్శకుడు విజయ్‌తో `చార్లి` అనే సినిమా చేయాల్సింది. కానీ కుదరలేదు. తర్వాత ఈ కథను నాకు చెప్పారు. ముందు నేను నటించనన్నా. ఎందుకంటే తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. మాతృభాష తమిళంలో నా మొదటి సినిమా కావడంతో... తొలి తమిళ...
భానుమతికి “ఫిదా”: ఈ రేంజ్ లో రివ్యూ చూసి ఉండరు!
ఫిదా.. ఈ సినిమాకు బాన్సువాడ భానుమతి అని టైటిల్ పెట్టి.. దానికి సింగిల్ పీస్, హైబ్రిడ్ రకం అని సబ్ టైటిల్ పెట్టాల్సింది. సినిమా నిండా భానుమతే. ఈ సినిమా గొప్పదనమేంటంటే.. హీరో.. హీరోయిన్ని చూసి ఎలా ఫీలవుతాడో.. ప్రేక్షకులు కూడా సేమ్ టూ సేమ్ అలాగే ఫీలవడం ఈ సినిమా ప్రత్యేకత. “తీసిన సినిమా తీయడం.. రాసిన పాత్రే రాయడం.. ఇది కాదా శేఖర్ కమ్ముల చిత్రం అని అనాలనిపిస్తుంది” ఈ సినిమా చూస్తే. ఎందుకంటే హ్యాపీడేస్ లో, ఆనంద్, గోదావరి వీటన్నిట్లోనూ హీరోయిన్ కేరెక్టర్స్...