Saturday, August 8, 2020

Entertainment

Home Entertainment Page 3
Entertainment category provides you all telugu entertainment stories and news which includes Cinema, Television and more

కుర్ర దర్శకులకు వరాలు ఇస్తున్న నేచురల్ స్టార్ నాని..

కెరీర్ మొదటి నుంచి కూడా నానితో స్టార్ దర్శకులు పెద్దగా పని చేయడంలేదు. అప్పుడెప్పుడో రాజమౌళి తర్వాత మళ్లీ ఇప్పటివరకూ ఏ అగ్ర దర్శకుడు కూడా నాని వైపు చూడలేదు. ఈయన కూడా కేవలం కొత్త దర్శకులు, కుర్రాళ్ళతోనే తన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నాడు నాని. అందులో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరో రెండు పట్టాలెక్కడానికి సిద్దంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ లాంటి సీనియర్ దర్శకుడితో...

మహేష్, వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోవడానికి అసలు కారణం అదే..

ఏడాది పాటు వెంట తిప్పించుకున్న తర్వాత ఈ మధ్య వంశీ పైడిపల్లి సినిమా మహేష్ బాబు క్యాన్సిల్ చేశాడు. ఈ సినిమా ఆగిపోయిందని తెలిసి మహేష్ అభిమానులు కూడా షాకయ్యారు. నిన్న మొన్నటి వరకు వంశీ సినిమా జూన్ నుంచి మొదలవుతుందని చెప్పిన మహేష్ బాబు ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడం వెనక అసలు కారణం ఏంటి అంటూ వాళ్ళు తలలు పట్టుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఆగిపోవడానికి గల కారణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిజానికి వంశీ పైడిపల్లి...

విక్రమ్ మరో ప్రయోగం.. కమల్ కు పోటీగా దశావతారం..

vikram cobra first look

కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాదు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుల్లో ఒకరు విక్రమ్. కమల్ హాసన్ తర్వాత నటనలో అంత పేరు తెచ్చుకున్నాడు ఈయన. ముఖ్యంగా ప్రయోగాలు చేయడంలో ఏమాత్రం వెనుకాడడు. తన ఇమేజ్ కూడా పక్కన పెట్టి కథ నచ్చితే ఎలాంటి పాత్రలో అయినా దూరిపోతాడు విక్రమ్. ఒకప్పుడు మంచి మంచి విజయాలతో తమిళనాట స్టార్ హీరోగా ఉన్న విక్రమ్ ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడుతున్నాడు. కొన్నేళ్లుగా విక్రమ్ నటించిన సినిమాలు ఏవి బాక్సాఫీస్ దగ్గర...

పార్టీ పెట్టింది టికెట్లు అమ్ముకోవడానికి కాదురా.. రాజశేఖర్ సంచలన డైలాగ్..

రాజకీయ పార్టీ పెట్టింది టికెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకోవడానికి కాదు.. ఈ మాటలు వినగానే తెలియకుండానే చిరంజీవి పేరు గుర్తుకు వస్తుంది. నిజానికి ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎక్కువగా విమర్శలు కూడా ఆయనపైనే వచ్చాయి. అప్పట్లో పార్టీ పేరు చెప్పుకొని ఆయన టికెట్లు అమ్ముకున్నాడు అంటూ ప్రతిపక్షాలు కూడా బాగానే ప్రచారం చేశాయి. ఆ పార్టీలో ఉన్న అల్లు అరవింద్ చాలా నియోజకవర్గాలకు వెళ్లి టికెట్లు అమ్ముకున్నాడని వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత 2009 సార్వత్రిక ఎన్నికల్లో...

KGF యశ్‌ను చంపాలనుకున్న క్రిమినల్ ఎన్‌కౌంటర్..

ఏంటి.. KGF యశ్ ను చంపాలనుకున్నారా..? ఎప్పుడు జరిగింది.. ఎందుకు జరిగింది.. అసలెందుకు ఆయన్ని చంపాలనుకున్నారు.. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. కాస్త మీడియాను బాగా ఫాలో అయ్యే వాళ్లకు సరిగ్గా ఏడాది కింద జరిగిన ఓ ఘటన గుర్తుండే ఉంటుంది. కర్ణాటకలో స్లమ్ భరత్ అనే ఓ క్రిమినల్ యశ్ హత్యకు కుట్ర చేసాడు. అయితే టైమ్ బాగుండి అతడి ప్లాన్ ముందే పసిగట్టి పోలీసులు అరెస్ట్ చేసారు. ఇక KGF సినిమాతో యశ్...

నితిన్‌కు షాక్ ఇచ్చిన తెలంగాణ బస్సు.. కేటీఆర్ గరంగరం..

ఈ రోజుల్లో పైరసీని అడ్డుకోవడం అంత ఈజీ కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎవరెన్ని ప్లాన్స్ చేసినా కూడా పైరసీ మాత్రం పారుతూనే ఉంది. పొద్దున్నే విడుదలైతే సాయంత్రానికి ఆన్ లైన్ లో పైరసీ వచ్చేస్తుంది. దీనికి ఏ సినిమా కూడా మినహాయింపు కాదు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా తెలంగాణ గవర్నమెంట్ బస్సులో భీష్మ సినిమాను ప్రదర్శించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దర్శక నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏం చేయలేకపోతున్నారు. టిఎస్ఆర్టీసీ బస్సులో భీష్మ...

రెడ్ టీజర్.. రామ్ పోతినేని డబుల్ డోస్ అదిరింది..

కెరీర్ ఫ్లాపుల్లో ఉన్నపుడు ఒక్క హిట్ చాలు మళ్లీ పుంజుకోడానికి. హీరో రామ్ విషయంలో కూడా ఇస్మార్ట్ శంకర్ ఇదే చేసింది. అప్పటి వరకు చాలా ఫ్లాపులు చూస్తున్న ఈ హీరోకు ఒక్కసారిగా వెయ్యేనుగుల బలాన్నిచ్చింది ఇస్మార్ట్ శంకర్. తొలి రోజు నుంచే మాస్ ఏరియాల్లో రప్ఫాడించింది ఈ చిత్రం. అలాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమా తర్వాత ఇప్పుడు ఈయన నటిస్తున్న సినిమా రెడ్. తనతో రెండు సినిమాలు చేసిన కిషోర్ తిరుమలనే ఈ చిత్రానికి దర్శకుడిగా తీసుకున్నాడు రామ్....

రివ్యూ: కనులు కనులను దోచాయంటే Kanulu Kanulanu Dochayante Review

నటీనటులు: దుల్కర్ సల్మాన్, గౌతమ్ మీనన్, రితూ వర్మ, రక్షణ్ తదితరులు కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: దేసింగ్ పెరియస్వామి నిర్మాతలు: వయాకమ్ 18 విడుదల తేదీ: ఫిబ్రవరి 28 మహానటి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు దుల్కర్ సల్మాన్. దానికి ముందే ఓకే బంగారంతో క్రేజ్ తెచ్చుకున్నాడు ఈయన. ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని కనులు కనులను దోచాయంటే...

రివ్యూ:హిట్ Hit telugu movie review

నటీనటులు: విశ్వక్ సేన్, రుహానీ శర్మ, భాను చందర్, మురళీ శర్మ తదితరులు ఎడిటర్: గ్యారీ బిహెచ్ సినిమాటోగ్రఫర్: మణికందన్ నిర్మాతలు: ప్రశాంతి, నాని కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: శేలేష్ కొలను అ.. లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాతో నిర్మాతగా మారిన నాని.. రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఇప్పుడు హిట్ సినిమాతో వచ్చాడు. ఇప్పటికే చాలాసార్లు చూసిన ఇన్వెస్టిగేటివ్...

మహేష్ బాబు తీరుతో విసిగిపోతున్న దర్శకులు..

ఒకప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని టాలీవుడ్ లో అగ్ర దర్శకులు కూడా కలలుగన్నారు. కానీ ఇప్పుడు ఆయన అవకాశం ఇస్తే కూడా భయపడుతున్నారు. మహేష్ లాంటి హీరో ఆఫర్ ఇస్తే పండగ చేసుకోవాల్సింది పోయి టెన్షన్ పడుతున్నారు దర్శకులు. దానికి కారణం కూడా ఆయనే. ఒకప్పుడు మహేష్ బాబు మాట ఇస్తే ఖచ్చితంగా అది పూర్తయ్యే వరకు మరో సినిమా వైపు చూసేవాడు కాదు. కానీ ఇప్పటి మహేష్ బాబు వేరు. ఒక సినిమా చేస్తూనే...