Saturday, August 8, 2020

Entertainment

Home Entertainment Page 2
Entertainment category provides you all telugu entertainment stories and news which includes Cinema, Television and more

దిశ సినిమా వచ్చేస్తుంది.. షూటింగ్ మొదలుపెట్టిన వర్మ..

వర్మ ఓ మాట చెప్పిన తర్వాత దాన్ని కొన్నిసార్లు మరిచిపోతుంటాడు. కొన్ని సినిమాలు అనౌన్స్ చేసినా కూడా అవి మొదలుపెట్టలేదు కూడా. అందులో జయలలిత బయోపిక్ అమ్మ, శశికళ లాంటి సినిమాలున్నాయి. అయితే ఇప్పుడు దిశ సినిమాను మాత్రం చెప్పినట్లుగానే మొదులపెట్టేసాడు ఈయన. అయినా వాస్తవిక ఘటనలను సినిమాలుగా మార్చడంలో వర్మ తర్వాతే ఎవరైనా. ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా కథ రాసుకుని సినిమా చేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ...

నిత్యామీనన్ మామూలుగా రెచ్చిపోలేదుగా.. బాపురే..

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇండ‌స్ట్రీలో నెగ్గుకురావాలంటే అందం మాత్ర‌మే ఉంటే స‌రిపోదు.. ఆ అందాన్ని ఆర‌బోసే త‌త్వం కూడా ఉండాలి. అలా కాదు కుద‌ర‌దు అంటూ మ‌డి క‌ట్టుకుని కూర్చుంటే.. ఎలాంటి ముద్దుగుమ్మైనా ఇంటికి ప‌రిమితం కావాల్సిందే. విజ‌యాలు వ‌చ్చినా.. అందాలు ఆర‌బోయలేద‌ని అవ‌కాశాలు ఇవ్వ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మ‌న ఇండ‌స్ట్రీలో బోలెడంత మంది ఉన్నారు. గ్లామ‌ర్ షో చేయ‌మ‌ని మొండికేసి కెరీర్ ను త్వ‌ర‌గా ముగించేసిన ముద్దుగుమ్మ‌లు కూడా మ‌న ఇండ‌స్ట్రీలో బోలెడు.

తెలుగు సినిమా స్థాయిని పెంచే “స్క్రీన్ ప్లే” ఈనెల 6 న ప్రేక్షకుల ముందుకు!!

బుజ్జి బుడుగు ఫిలిమ్స్ పతాకంపై డాక్టర్ అరుణకుమారి నిర్మించిన చిత్రం 'స్క్రీన్ ప్లే'. 'ఆఫ్ ఏన్ ఇండియన్ లవ్ స్టొరీ' అన్నది ట్యాగ్ లైన్. పరిశ్రమవర్గాల్లో 'స్క్రిప్ట్ డాక్టర్'గా సుప్రసిద్ధులైన కె.ఎల్.ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన ఒక ముఖ్య పాత్ర కూడా పోషించడం విశేషం. విక్రమ్ శివ-ప్రగతి యాదాటి హీరోహీరోయిన్లు. ఎం.వి.రఘు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఎం.ఏ.శ్రీలేఖ సంగీతం సమకూర్చారు. రాజేష్ ఫణి ఎడిటర్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల...

పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గిపోయిందా.. టెన్షన్ పడుతున్న దిల్ రాజు..

ఏం మాట్లాడుతున్నారు మీరు.. పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గిపోవడం ఏంటి.. ఆయన ఎప్పుడెప్పుడు సినిమాలు చేస్తాడా ఎప్పుడెప్పుడు డేట్స్ తీసుకుందామా అని నిర్మాతలు వేచి చూస్తుంటే ఇప్పుడు ఆయన ఇమేజ్ తగ్గిపోయిందా అని అడుగుతున్నారు.. అదెక్కడి ప్రశ్న అనుకుంటున్నారా.. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఖచ్చితంగా అభిమానులకు కోపం వస్తుంది. కానీ బయట రియాలిటీ మాత్రం ఇలాగే ఉంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ ఇప్పుడు కనిపించడం లేదు. ఖచ్చితంగా ఆయన సినిమా విడుదలైనప్పుడు కలెక్షన్లు మాత్రం భారీగానే...

సీనియర్ ఎన్టీఆర్ దారిలో జూనియర్ ఎన్టీఆర్..

ఇప్పుడు కాదు కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా తాతను ఫాలో అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అన్నింటిలో తనకు తాత ఆదర్శం అంటాడు. అసలు ఈ జీవితమే ఆయన ఇచ్చిన బిక్ష.. అలాంటప్పుడు ఆయనను ఫాలో అయితే తప్పేంటి అంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు నందమూరి చిన్నోడు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా చాలా బిజీగా ఉన్న సమయంలో బయట నిర్మాణ సంస్థలతో సినిమాలు చూసే కంటే కూడా సొంత నిర్మాణ సంస్థ ఒకటి ఏర్పాటు...

చిరంజీవి సినిమాను సాయి ధరమ్ తేజ్ రీమేక్ చేస్తున్నాడా..

Chiranjeevi

మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సాయి ధరమ్ తేజ్. మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలు ఇచ్చి ఇమేజ్ పాడు చేసుకున్న కూడా 2019లో రెండు హిట్ సినిమాలతో మళ్లీ రేస్ లోకి వచ్చాడు మెగా మేనల్లుడు. చిత్రలహరితో మంచి విజయం అందుకున్న ఈ హీరో.. ప్రతి రోజు పండగే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటరూ అంటూ వస్తున్నాడు సాయి. మే 1 న ఈ సినిమా ప్రేక్షకుల...

లీక్ అయిన విజయ్ దేవరకొండ ఫైటర్ లొకేషన్ స్టిల్స్..

Vijay Devarakonda Fighter Leaked Pic

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్ పూర్తిగా గాడితప్పింది. ప్రస్తుతం ఈయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. ప్యాన్ ఇండియన్ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నాడు పూరీ. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత వస్తుండటంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ పెడుతున్నాడు పూరీ. హిందీలో ఈ సినిమాను తీసుకెళ్లి కరణ్ జోహార్ చేతుల్లో పెడుతున్నాడు...

గ్రీన్ ఇండియా.. రోజా తోటలో పూసిన ఖుష్బూ మొక్కలు..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫిబ్రవరి 29న ప్రముఖ నటి ఖుష్బూ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. ఈ కార్యక్రమంలో రోజా వనం ఫౌండర్ రోజా, అలాగే గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్న రోజా గారికి కృతజ్ఞతలు తెలిపారు. దాంతో పాటు ఎంపీ సంతోష్ గారిని కుష్బూ ప్రత్యేకంగా అభినందించారు. మానవ...

ధనుష్‌కు చెన్నై కోర్ట్ షాక్.. బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలని తీర్పు..

ధ‌నుష్ కొన్ని రోజులుగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే కొన్నేళ్లుగా ఈయనపై మరో కేసు కూడా నడుస్తుంది. ఈయన జన్మరహస్యం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఈయన తమ కొడుకే అంటూ మూడేళ్ల కింద మేలూరు తాలూకాలోని మనంపట్టి గ్రామానికి చెందిన ఆర్. కథరేసన్, కె. మీనాక్షి దంప‌తులు ధనుష్ పై కేసు వేసారు. మా ఇద్దరికీ ధనుష్ నవంబర్ 7, 1985లో జన్మించాడని, అని అసలు పేరు కాలిసెల్వన్ అని తెలిపారు ఈ జంట‌. ఈ మేరకు వాళ్ల కోరిక‌ను...

అనసూయతో యుద్ధం చేస్తున్న రోజా.. గెలుపెవరిదో..

తెలుగు ఇండస్ట్రీలో యాంకర్స్ చాలా తక్కువగా ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుమ కనకాల గురించి. ఆమె తర్వాత అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్ లాంటివాళ్ళు బుల్లితెరపై సత్తా చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు పోటీగా ఎమ్మెల్యే రోజా కూడా వచ్చేసింది. ఈమె కూడా కొన్ని రోజులుగా వరుస రియాల్టీ షోలు చేస్తూనే ఉంది. ఇప్పటికే జబర్దస్త్ కామెడీ షో కు జడ్జిగా ఉన్న రోజా బతుకు జట్కా బండి అనే మరో ప్రోగ్రామ్ కూడా చేస్తోంది. మధ్యలో కొన్ని వేరే...