Wednesday, August 10, 2022

Entertainment

Home Entertainment
Entertainment category provides you all telugu entertainment stories and news which includes Cinema, Television and more

పవన్ కళ్యాణ్ మరోటి.. క్రిష్ సినిమాకు ముహూర్తం.. ఎన్ని కాల్షీట్స్ ఇచ్చాడో తెలుసా?

రెండేళ్లుగా పూర్తిగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నాడు. వరస సినిమాలు చేస్తున్నాడు ఈయన. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు పవర్ స్టార్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను కూడా మొదలు పెట్టాడు పవన్. తాజాగా క్రిష్ సినిమాకు కూడా కొబ్బరికాయ్ కొట్టాడు ఈయన.

అంతా చూస్తుండగానే జీవితకు వార్నింగ్ ఇచ్చిన వర్మ..

రామ్ గోపాల్ వర్మ అంటేనే కేరాఫ్ సంచలనం. ఈయన ఎప్పుడు ఎవరిని ఎక్కడ అలా టార్గెట్ చేస్తాడో చెప్పడం కూడా కష్టమే. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. సాధారణంగా ఈయనను తన శిష్యులు కాకుండా బయటి వాళ్ళు సినిమా వేడుకలకు పిలవరు. తాజాగా ఈయన స్టాలిన్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చాడు. స్టాలిన్ అంటే చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా కాదు.. తాజాగా తమిళ హీరో జీవా చేస్తున్నది. ట్యాగ్లైన్ అందరివాడు అని పెట్టుకున్నాడు జీవా. రత్న శివ...

ఎఫ్ 3 లో మహేష్ బాబు.. సెకండాఫ్ లో సూపర్ స్టార్ ఎంట్రీ..

Mahesh in f3

మహేష్ బాబు ఒకసారి దర్శకులను నమ్మాడు అంటే మళ్ళీ మళ్ళీ వాళ్లతోనే సినిమాలు చేస్తాడు. కెరీర్లో ఇప్పటికే చాలాసార్లు ఇది ప్రూవ్ అయింది. తాజాగా అనిల్ రావిపూడితో కూడా మరోసారి వర్క్ చేయబోతున్నాడు ఈ హీరో. ఈ కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంచలన విజయం సాధించింది. ఇక ఈ దర్శకుడు నెక్స్ట్ ఎఫ్ 3 సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో కూడా మరోసారి...

రాజమౌళికి శంకర్ ఎదురెళ్తున్నాడా.. RRRకి పోటీగా భారతీయుడు 2..

ఇద్ద‌రూ ద‌క్షిణాది ద‌ర్శ‌కులే. కానీ ఇప్పుడు ఇద్ద‌రూ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్స్ గా ఎదిగారు. ద‌క్షిణాది సినిమా రంగం నుంచి వ‌చ్చి.. ఇక్క‌డి సినిమాలను ఇండియ‌న్ సినిమా స్థాయి పెంచే విధంగా తెర‌కెక్కించారు. మ‌గ‌ధీర‌, ఈగ‌, బాహుబ‌లి లాంటి సినిమాల‌తో రాజ‌మౌళి స‌త్తా ఇండియ‌న్ సినిమాకు తెలిసింది. ఇక ఈయ‌న కంటే ముందే శంక‌ర్ మ‌న ద‌క్షిణాది సినిమా రంగాన్ని బాలీవుడ్ ముందు పెట్టాడు. అక్క‌డోళ్లు శంక‌ర్ స‌త్తా చూసి నోరెళ్ల‌బెట్టుకున్నారు. రోబో, ఐ, 2.0 సినిమాల‌తో త‌న...

ఆ జబర్దస్త్ యాంకర్ 100 ఎకరాల భూమి కొనేసిందా..

తెలుగులో సుమ కనకాల తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న యాంకర్స్ అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్. జబర్దస్త్ కామెడీ షోతో వీళ్లిద్దరు జాతకాలు మారిపోయాయి. అంతకు ముందు ఒక్క అవకాశం అంటూ చూసిన వీళ్ళు జబర్దస్త్ తర్వాత ఎన్ని షోలకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీ అయిపోయారు. ఒక ప్రోగ్రాం వీళ్ల జాతకాన్ని అంతగా మార్చేసింది. ఇక ఇప్పుడు రష్మి గౌతమ్ కు సంబందించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరిగేస్తుంది. ఈమె మనసు సినిమాల...

కోట శ్రీనివాసరావు పరిస్థితి అంత దారుణంగా ఉందా..

తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుడు కోట శ్రీనివాసరావు కూడా ఉంటాడు. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలలో నటించాడు. ఇప్పటికే దాదాపు 500 పైగా చేశాడు కూడా కోట శ్రీనివాసరావు. అయితే వయసు మీద పడటంతో ప్రస్తుతం ఆయనకు అవకాశాలు రావడం లేదు. ఇదే విషయంపై కూడా చాలా మనోవేదన చెందుతున్నాడు. తనను ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదని చాలా బాధ పడుతున్నాడు. ఈ సీనియర్ నటుడు గత కొన్నేళ్లుగా కేవలం ఇంటికే పరిమితం అయిపోయాడు...

ధనుష్‌కు చెన్నై కోర్ట్ షాక్.. బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలని తీర్పు..

ధ‌నుష్ కొన్ని రోజులుగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే కొన్నేళ్లుగా ఈయనపై మరో కేసు కూడా నడుస్తుంది. ఈయన జన్మరహస్యం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఈయన తమ కొడుకే అంటూ మూడేళ్ల కింద మేలూరు తాలూకాలోని మనంపట్టి గ్రామానికి చెందిన ఆర్. కథరేసన్, కె. మీనాక్షి దంప‌తులు ధనుష్ పై కేసు వేసారు. మా ఇద్దరికీ ధనుష్ నవంబర్ 7, 1985లో జన్మించాడని, అని అసలు పేరు కాలిసెల్వన్ అని తెలిపారు ఈ జంట‌. ఈ మేరకు వాళ్ల కోరిక‌ను...

సుడిగాలి సుధీర్ ఈసారైనా సక్సెస్ అవుతాడా..

బుల్లితెర నటులు వెండితెరకు రావడం కొత్తేమి కాదు. అక్కడ కాస్త క్రేజ్ సంపాదించిన వెంటనే సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు జబర్దస్త్ కామెడీ సుడిగాలి సుదీర్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన హీరోగా ఇప్పటికే ఒక సినిమా చేశాడు.. కానీ అది అంచనాలు అనుకోలేదు. రెండు నెలల క్రితం విడుదలైన సాఫ్ట్ వేర్ సుదీర్ సినిమా ముచ్చటగా మూడు రోజులు కూడా థియేటర్లలో కనిపించలేదు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈయన. ఈసారి ఒక్కడు కాకుండా మన...

అనుకున్నదే.. డిస్కో రాజాకు సంక్రాంతి సినిమాల దెబ్బ..

ముందు నుంచి అనుకుంటున్నదే.. ఇప్పుడు మరోసారి కలెక్షన్స్ రూపంలోనే కనిపించింది. డిస్కో రాజా సినిమాను రాంగ్ టైమ్ లో రిలీజ్ చేసారంటూ ముందు నుంచి కూడా రవితేజ అభిమానులు కాస్త అసంతృప్తిలోనే ఉన్నారు. అయితే సంక్రాంతి సినిమాలు అప్పటికే వచ్చి రెండు వారాలు అయిపోతాయి కాబట్టి థియేటర్స్ దొరుకుతాయి అనుకున్నారంతా.. కానీ మూడో వారంలోనూ పండగ సినిమాలే ఉండటంతో మాస్ రాజాకు సరైన థియేటర్స్ దొరకనే లేదు.

బిగ్ బాస్ ఎలిమినేషన్ టెన్షన్…హేమ కి ఎర్త్ పెట్టినట్లేనా…?

మొత్తానికి బిగ్ బాస్ తొలివారం పూర్తైంది. మొదటివారం ఎలిమినేషన్‌కి రంగం సిద్దమవ్వడంతో కంటెస్టెంట్లలో టెన్షన్ పీక్స్ కి వెళ్ళింది. ఉన్న 15 మంది కంటిస్టెంట్లలో వారానికి ఒకరు చొప్పున ఎలిమినేట్ అయ్యేది వారం చివర్లోనే. ఈవారం రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. హోస్ట్ నాగార్జున ఈరోజు దగ్గరుండి ఎవరిని సాగనంపుతారా అన్న టెన్షన్ ఇప్పుడు కంటిస్టెంట్ల గుండెల్లో గుబులు రేపుతుంది.