
ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషనర్, జడ్జీలాంటి వారికి వైసీపీ నేతలు కులాలు అంటగట్టడం అన్యాయమని అన్నారు. కరోనాను సాకుగా చూపిస్తూ ఎన్నికలు వాయుదా వేయాలని కోరడం సమంజసం కాదన్నారు. పోలీసులు చిన్న చిన్న పొరపాటు జరిగితేనే జర్నలిస్టులపై కేసుపెడుతున్నారని ..కాని వివేకా హత్యపై దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు. అదేవిధంగా వైసీపీ నాయకులు ఎన్నికలప్పుడే కరోనా గుర్తోచ్చిందా ..మీరు ర్యాలీలు తీసినప్పుడు గుర్తురాలేదా అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.