Home News Politics

తమిళనాట తలైవా రాణిస్తారా …

రజినీకాంత్ … త్తమిళనాట సూపర్ స్టార్ .. అయితే రాజకీయాలలో మాత్రం స్లో మాస్టర్. .. ఇంకా అయన ఆలోచిస్తున్నారట .. ఇప్పుడు తమిళనాట రాజకీయ శూన్యత ఉంది కాబట్టి ఇక ఫాస్ట్ గా రాజకీయాలకు వచేస్తారట … మొత్తం మీద తమిళనాట తలైవా శకం రానుందా…

ఎట్టకేలకు రాజకీయాల్లో తన పాత్రపై రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. చెన్నైలో మాట్లాడిన ఆయన.. తన ఆలోచనలను స్పష్టంగా వివరించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ వ్యవస్థ మారాలని, దీనిని సరిదిద్దవలసి ఉందన్నారు. తాను ముఖ్యమంత్రిని కావాలనుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి పదవి గురించి తాను ఆలోచించడం లేదన్నారు. అయితే ఈ మాట కొంత అస్పష్టత సృష్టించే అవకాశం ఉంది ..

తన పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తామన్నారు. విద్యావంతులు, నిజాయితీపరులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి ‘అమ్మ’ జయలలితను ప్రస్తావించారు. ఆమె మరణానంతరం రాజకీయంగా పెద్ద లోటు ఏర్పడిందన్నారు. తన పార్టీలో యువతకు స్థానం కల్పిస్తామన్నారు. శాసన సభలో కూర్చోవడం గురించి కూడా ఊహించడం లేదన్నారు. తన పార్టీలో 65 శాతం మంది విద్యావంతులైన యువత ఉంటుందన్నారు. నేడు రాజకీయ పార్టీలు వ్యాపార సంస్థల మాదిరిగా నడుస్తున్నాయని, వాటికి ఓట్లు మాత్రమే కావాలని, ప్రజల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజల కోసం పని చేయవలసి ఉందని, నిజాయితీపరులకు తన పార్టీ తరపున పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. డీఎంకే, ఏఐఏడీఎంకేలను తన పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. తమిళనాడు రాజకీయాలను విశ్లేషిస్తున్నానని చెప్పారు.

2017లో రాజకీయ ప్రవేశంపై వివరణ ఇచ్చానన్న ఆయన.. నాటి నుంచి తమిళనాడు పరిస్థితులను విశ్లేషించడం మొదలుపెట్టానన్నారు. ప్రజల మనస్తత్వం కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థలో మార్పు రావలసి ఉందని భావించానని.. రాజకీయ నాయకులకు ప్రజలంటే కేవలం ఓట్లేనని.. సమయానికి తగ్గట్టు పాలన లేదని వ్యాఖ్యానించారు. అత్యధికమంది పార్టీలో భాగస్వాములయ్యేలా చూసుకుంటానన్నారు. తనకు మూడు ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు. జయ మరణం తర్వాత రాజకీయ అస్థిరత ఏర్పడిందని.. ప్రభుత్వం, పార్టీలపై ఒకే వ్యక్తి పెత్తనం సరికాదన్నారు. ఇప్పుడున్న పార్టీల్లో 50ఏళ్లకు పైబడినవాళ్లే ఉన్నారని.. రాజకీయాల్లోకి యువకులు రావాలని పిలుపునిచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేల వారసులకే టికెట్లు ఇస్తున్నారన్నారు. తన పార్టీలో 60 నుంచి 65శాతం యువతకే టికెట్లు కేటాయిస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here