Home News Updates

ఏ పి పోలీస్ లో ఆందోళన

ఏ పి పోలీస్ లో ఆందోళన మొదలైంది. శాంతి భద్రతలు కాపాడడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వం ఆదేశిస్తున్న విధంగా నేరాలు అరికట్టడానికి కొంత ఇబ్బందీ అంటున్నారు. ఎందుకంటే జనానికి సరిపడా పోలీస్ సిబ్బంది లేరు. వున్న వాళ్ళు కోర్టులకు ., విచారణలు., వెళ్తుంటే ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న కేసులు., ఫిర్యాదులతో సతమతం కావాల్సిన పరిస్థితి ఉంది. ఇది చాలదన్నట్లు ప్రతిపక్షాల ఆందోళనలు., దీనికి అధికార పక్ష కార్యకర్తల నిరసనలు ., అక్కడ ఉద్రిక్తత నెలకొనడం., దానిని అదుపు చేయడానికి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అవసరం కావడం జరుగు తోంది. ఒక వేళ అదుపు చేయలేకపోయినా., అదుపు చేసినా కోర్ట్ లలో కేసులు., పోలీస్ లకు సమన్స్ పెద్ద బర్డెన్ గా మారిందని చెప్పడం లో సందేహం లేదు.
అంతే గాక ఇటీవల జరిగిన పరిణామాలతో డిపార్ట్‌మెంట్‌ పరువు పోతోందని పలువురు పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు పరువు తీస్తున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల వ్యవధిలోనే హెడ్‌ ఆఫ్‌ ద పోలీస్‌ ఫోర్స్‌ ను హైకోర్టు స్వయంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం మొత్తం డిపార్ట్‌మెంట్‌కు వర్తిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ కారణాలు, ఇతరత్రా వ్యవహారాల్లో చిక్కుకోకుండా పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తే పోలీస్‌ బాస్‌ ఎందుకు కోర్టు ముందు నిలబడాల్సి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. విశాఖపట్నం లో ఒక చిన్న కేసు విషయం లో డి జి పి హాజరు కావాలంటూ హై కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఆదేశాలతో పోలీసుశాఖ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇంతలోనే సోమవారం మరోసారి డీజీపీకి తాఖీదులందాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డగింత.. అరెస్టు వ్యవహారంపై మార్చి 12న స్వయంగా హాజరయి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇది చాలదన్నట్లు రాబోయే స్థానిక ఎన్నకల కు ముందే గ్రామాలలో పరిస్థితి పై అప్ప్పుడే పోలీస్ వర్గాలలో ఆందోళన మొదలైంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here