Home News

బ్రేకింగ్: ఏపీలో మరో రెండు వారాలు కర్ఫ్యూ పొడగింపు ?

ఏపీలో మరో రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగించే ఆలోచనలో ఉంది జగన్ ప్రభుత్వం. ఈ నెల 31న కరోనా కర్ఫ్యూ పై కీలక సమీక్ష చేయనున్నారు సీఎం జగన్. కొన్ని మినహాయింపులు ఇవ్వటమా లేక యథాతథ స్థితి కొనసాగించాలా అన్న అంశంపై సోమవారం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. గత కొద్దిరోజులుగా ఉభయగోదావరి, చిత్తూరు జిల్లాలు మినహా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర తాజా మార్గదర్శకాల నేపథ్యంలో కర్ప్యూ మరో రెండు వారాలు పొడగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ ను కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా బదిలీ చేయగా టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా అదనపు బాధ్యత ఇస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీటీడీసీ ఎండి గా బాధ్యతలు చూస్తున్న ప్రవీణ్ కుమార్ ను ప్రకాశం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్ అధికారి ఎస్. సత్యనారాయణకు ఏపీటీడీసీ ఎండి బాధ్యతలు అప్పగించింది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్ అధికారి పి బసంత్ కుమార్ కు మున్సిపల్ అండ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఎమ్ఐజీ హౌసింగ్ ప్రత్యేక అధికారిగా నియమించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here