Home Women Recipes

బ్రెడ్ ఉప్మా తయారుచేసే పద్ధతి


బ్రెడ్ ఉప్మా తయారుచేసే పద్ధతి { Bread Upma Recipe preparation} : ముందుగా బ్రెడ్ ను చాలా చిన్నచిన్న ముక్కలుగా కోయండి. తర్వాత ఒక గిన్నెలో నూనెపోసి, స్టౌ మీద వేడిచేసి ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, చిటికెడు పసుపు కలిపి అందులో బ్రెడ్ ముక్కల్ని కూడా వేసి లేత రంగులో దోరగా వేయించి ఉంచుకోండి.

కావలసిన పదార్థాలు :
బ్రెడ్ : 200 గ్రా., ఉల్లిపాయలు : 100 గ్రా., పచ్చిమిర్చి : 10 గ్రా., నిమ్మకాయ : సగంముక్క, ఆవాలు : పావు టీస్పూన్, పసుపు : చిటికెడు, ఉప్పు : తగినంత, పంచదార : 2 చిటికెడు, రిఫైన్డ్ ఆయిల్ : 20 గ్రా.

తయారుచేసే పద్ధతి :ముందుగా బ్రెడ్ ను చాలా చిన్నచిన్న ముక్కలుగా కోయండి. తర్వాత ఒక గిన్నెలో నూనెపోసి, స్టౌ మీద వేడిచేసి ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, చిటికెడు పసుపు కలిపి అందులో బ్రెడ్ ముక్కల్ని కూడా వేసి లేత రంగులో దోరగా వేయించి ఉంచుకోండి. ఈ మిశ్రమంలో అవసరమైతే కొంచం నీళ్లుపోసి గిన్నెపై మూతపెట్టి.. మూడు, నాలుగు నిముషాలు ఉడికించండి.

తర్వాత పంచదార, నిమ్మరసం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి రెండు, మూడు నిముషాలుంచిన తర్వాత గిన్నెను స్టౌమీద నుంచి దించేయండి. అంతే నోరూరించే బ్రెడ్ ఉప్మా రెడీ అయినట్లే.

ఉప్మాను ప్లేట్లలో సర్ది వేడివేడిగా అతిథులకు అందించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here