Home News

ఆ రాజుగారిని ని బొత్స టార్గెట్ చేశారా…!

ఆ ఇద్దరూ సీనియర్ నేతలే … ఓకరేమో సమయానుకూల రాజకీయాలు చేయడంలో ఘనాపాటి .. మరోకరు రాజకీయాల్లో మచ్చలేని నేతగా పేరున్న నాయకుడు .. ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులే అయినా 2014 వరకు ఒకరినొకరు ప్రత్యక్షంగా టార్గెట్‌ చేసుకున్న సందర్భాలు తక్కువే.. అయితే ఇప్పుడు సీన్‌ మారుతున్నట్లు కనిపిస్తోంది .. ఆ ఇద్దరు నేతలు డీ అంటే ఢీ అనే పరిస్థితి తలెత్తింది … పవర్‌ చేతిలో ఉండటంతో ఆ క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న లీడర్ని టార్గెట్‌ చేస్తూ తనదైన శైలిలో చకచకా పావులు కదుపుతున్నారు బొత్స… అనూహ్యంగా బొత్స రాజుగారిని ఎందుకు టార్గెట్ చేసినట్లు….!

ఏపిలో విజయనగరం జిల్లా రాజకీయాల ఊసెత్తగానే ఠక్కున గుర్తొచ్చే నేతలిద్దరే .. ఒకరు గజపతిరాజ వంశవారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి ఏడుసార్లు ఏమ్మెల్యేగా , ఎంపిగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన పూసపాటి అశోక్‌గజపతిరాజు .. మరొకరు ఉత్తరాంధ్రలో కీలక రాజకీయనేతగా ఏదిగి.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పిసిసి ఛీఫ్ గా పని చేసిన ప్రస్తుత పురపాలక శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ … 2014 ముందు వరకు ఈ ఇద్దరు సీనియర్ నేతలు ఎప్పుడూ డైరెక్ట్‌గా ఓకరి పై ఓకరు విమర్శలు చేసుకోలేదు .. బొత్స చీపురపల్లి ఎమ్మెల్యేగా, అశోక్ గజపతిరాజు విజయనగరానికి ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చారు .. దాంతో వారి మధ్య రాజకీయ వైరం కూడా పెద్దగా కనిపించేది కాదు ..

అయితే రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రంలో ఏక్కడా లేని విధంగా విజయనగరంలో భారీ విధ్వంసం జరిగింది … రాష్ట్ర విభజనకు నాటి పిసిసి చీఫ్‌ బొత్సనే కారణమంటూ విద్యార్దులు, టిడిపి నేతలు , అశోక్ గజపతిరాజు సైతం రోడ్డెక్కి నిరసనలు తెలిపారు .. ఆ నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో వారానికి పైగా కర్ఫ్యూ పెట్టాల్సి వచ్చింది విజయనగరంలో… 2014 లో టిడిపి అధికారం చేపట్టి, అశోక్‌గజపతి మంత్రి అయి .. బొత్సని టార్గెట్ చేస్తూ వచ్చారు .. బోత్సా వైసిపిలో చేరినప్పుడు కూడా … రాష్ట్ర విభజనకి బొత్సనే కారణమని, రాజశేఖర్ రెడ్డిపై నిందలు వేసిన బొత్స ఆపార్టీలోకి ఎలా వెళ్తారని ధ్వజమెత్తారు .. మద్యం ఇసుక సిండికేట్లని బొత్సానే నడిపించేవారంటూ నగరమంతా ప్లేక్సీలు పెట్టిమరీ విమర్శలు గుప్పించారు అశోక్ గజపతిరాజు .. ఆ ఎఫెక్టో ఏమో ఎన్నడు అశోక్‌గజపతిని డైరెక్ట్‌గా విమర్శించని బొత్స సత్యనారాయణ .. ఇప్పుడు నేరుగా ఆయన్నే టార్గేట్ చేస్తూ పావులు కదుపుతున్నారు … తిరిగి మంత్రి అయ్యాక బొత్స విజయనగరం జిల్లాలో మరోసారి తన మార్క్ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు ..

అశోక్‌గజపతిరాజు ఆస్తులపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు బొత్స .. అశోక్ చైర్మన్‌గా ఉన్న మాన్సస్ ట్రస్ట్ ఎవరి సొంత ఆస్థి కాదని, అవి ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న భూములని ప్రకటించారు .. మాన్సస్ భూములను గజపతి కుటుంబం తమ సొంత జాగీరులా చూస్తున్నారని.. ప్రైవేట్ వ్యక్తులకు అద్దెలకిస్తూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బడాబాబుల లబ్ది చేకూరుస్తున్నారని మండిపడ్డారు.. అంతేకాకుండా అశోక్ తమ ఎన్నికల అవిడఫిట్ లో తనకు వివాదాస్పద భూములు ఉన్నాయని పేర్కొన్నారని.. ఆ వివాదాస్పద భూముల లెక్కలు ఏంటో తేల్చాలని అధికారులను ఆదేశించారు. అశోక్‌గజపతిపై బొత్సి దూకుడు ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది .. గతంలో ఎప్పుడు అశోక్ ఆస్తుల పై ఒక్క మాట మాట్లాడని బొత్స … ఇప్పుడు నేరుగా రాజావారి ఆస్తుల పై లెక్కలు తేల్చాలనటం సర్వత్రా చర్చకు దారితీస్తోంది ..

అశోక్ గజపతిరాజు తాతగారైన అలకనారాయన గజపతి మాన్సస్ అనే ఒక ట్రస్ట్ ను స్థాపించి తన ఆస్తులను ట్రస్ట్ కు అప్పగించారు .. అయితే ఆ ట్రస్ట్‌కు పూసపాటి గజపతుల వారసులే ఛైర్మన్‌లుగా వ్యవహరిచాలన్న నిబంధన పెట్టారు.. విజయనగరం మెయిన్ సెంటర్ గా చెప్పుకొనే బాలాజీ జంక్షన్లో ఈ ట్రస్ట్ పేరిట సుమారు 45 ఎకరాల ఖాళీ భూమి ఉంది.. ఈ భూమిలో మెడికల్ కళాశాల పెడతామని అప్పట్లో ప్రభుత్వానికి హామీ ఇచ్చారు అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు … ఆయన మరణించడంతో మెడికల్ కాలేజీ ప్రతిపాదన అటకెక్కింది . ..ఆ భూమి ఇప్పటివరకు ఖాళీగా ఉండగా ఇప్పుడు ప్రైవేటు వారికి అద్దెలకు ఇవ్వటం ప్రారంభించారు.. ఇప్పటికే సగానికి పైగా భూముల లావాదేవీలు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ట్రస్ట్‌ భూములను తక్కువ ధరలకే ప్రైవేట్ వారికి లీజుకి ఇవ్వడం ఒకింత వివాదాస్పదం అవుతోంది .. దానిపై బొత్స ప్రత్యేక దృష్టి సారించి అధికారుల రివ్యూ కూడా నిర్వహించారు ..

ఏదేమైనా ఎప్పుడు గజపతి కుటుంబంపై పెదవి విప్పని బొత్స ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది .. ఆయన గత అయిదేళ్లుగా అశోక్ తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇవ్వలనుకుంటున్నారా… మాన్సాస్ లో అక్రమాలు జరిగాయని నిరూపించి ఆయన్ని రాజకీయంగా ప్రజలముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అన్న చర్చ నడుస్తోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here