Home Entertainment Cinema

పేకాట ఆడుతూ దొరికిపోయిన టాప్ హీరోయిన్.. ఎవరా కళావర్ రాణి?

పేకాట ఆడడం చట్టరీత్యా నేరం. చాలా చోట్ల ఈ ఆటను బ్యాన్ చేశారు కూడా. ఆన్ లైన్ లోనూ పేకాట ఆడటం నేరమే. అయితే ఈ ఆట ఆడటం అంటే చాలా మందికి ఇష్టం. ఒక అరడజను మంది ఒకచోట చేరారు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పేకాట. పేక ముక్కలు తీసుకుని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఒక టాప్ హీరోయిన్ కూడా ఇదే చేసింది. షూటింగ్ లో కాస్త టైం దొరకడంతో హాయిగా తన టీంతో కలిసి పేకాట ఆడేసింది. అలా ఎంజాయ్ చేసిన ముద్దుగుమ్మ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.

ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. దానికి తోడు యాడ్స్ కూడా చేస్తుంది. దీంతో ఇంతసేపు షూటింగ్ బిజీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మైండ్ కు రిలాక్స్ అనేది అవసరం. అందుకే సెట్లో కాస్త సమయం దొరకగానే కత్రినా కూడా పేకాట ఆడుతూ కనిపించింది. అయితే ఈ ఫోటోలు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సూర్యవంశీ సినిమాలో నటిస్తుంది. ఇందులో అదిరిపోయే రోల్ చేస్తోంది కత్రినా. గతంలోనే అక్షయ్ కుమార్ తో చాలా సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు మరోసారి రొమాన్స్ చేస్తోంది. సూర్యవంశీలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు అక్షయ్ కుమార్. ఈ సినిమా షూటింగ్ లో సరదాగా తన సన్నిహితులతో కలిసి పేకాట మొదలుపెట్టింది కత్రినా కైఫ్. కొత్త పెళ్లి కూతురు గెటప్ లో కనిపిస్తున్న కత్రినా తన సహచరులతో కలిసి పేకాట ఆడుతుంది. వధువు గెటప్ లో మెహెందీ హైలైట్ గా కనిపిస్తోంది.

షాట్ గ్యాప్ లో ఇలా తన బృందం తో కలిసి పేకాట ఆడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదేమైనా కూడా ఒక స్టార్ హీరోయిన్ పేకాట ఆడుతూ దొరికిపోవడంతో నెటిజన్లు కూడా బాగానే ఆడుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here