Home News

ఆ ఓడిన నేతకి కీలక పదవి…!

ఎన్నికల్లో ఓటమి చెందిన ముఖ్య నాయకుడికి గులాబీబాస్‌ కీలక పదవి కట్టబెడతారా? .. ఉత్తర తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి అడ్డుకట్ట వేయడానికి ఆ నాయకుడే కరెక్ట్ అని కేసిఆర్ భావిస్తున్నారా? .. కమలం పార్టీ లెక్కలతో లక్‌ వరించబోతున్న సదరు లీడర్‌ ఎవరు? … ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? … అధినేతతో సాన్నిహిత్యం ఆయనకు ఎలా కలిసి రాబోతోంది?

మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుడు.. ఉద్యమకాలం నుంచి కేసిఆర్ కు కుడిభుజం… ఎన్నికల ప్రచారాన్ని గులాబీబాస్‌ కరీంనగర్ నుంచే ప్రారంభించారంటే .. ఆయన వినోద్ కుమార్ ఎంతో ప్రాధాన్యం ఇస్తారో అర్థమవుతుంది… దానికి తగ్గట్లే సబ్జెక్ట్‌ ఉన్న వినోద్‌కుమార్‌ సౌమ్యంగా మెసులుతూ.. వివాదాలకు దూరంగా ఉంటారు..

మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ గెలుస్తారనే అందరూ భావించారు.. అయితే అనుహ్యంగా ఆయన ఓటమి పాలయ్యారు …. ఇప్పుడు వినోద్ సేవలను మరో విధంగా ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది … రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి ఇస్తారని… లేకపోతే ఎమ్మెల్సీని చేసి రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని పార్టీలో నాయకులు చర్చికుంటున్నారు .. ఆ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్ ముగియగానే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది …

కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసిన వినోద్ కుమార్ గెలుపు నల్లేరు పై నడకేనని అందరూ భావించారు… అనూహ్యంగా పరిస్థితులు తారుమారై అక్కడ బిజెపీ ఆభ్యర్థి బండి సంజయ్ కుమార్ విజయం సాధించడంతో టిఆర్‌ఎస్‌ వర్గాలు అవాక్కయ్యాయి… పార్లమెంట్ ఎన్నికల ప్రచారనికి కరీంనగర్ నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసిఆర్.. వినోద్‌కుమార్‌ని దేశం అబ్బురపడే మొజార్టీతో గెలిపించాలని .. ఆయన గెలిస్తే కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపడతారని ప్రకటించారు .. అయితే ఆయన పరాజయం పాలవ్వడంతో కేసీఆర్ ఆయన సేవలను ఎలా వినియోగించుకోవాలో అన్న విషయమై ఆలోచిస్తున్నారంట.. వినోద్‌కు ఎమ్మెల్సీగా అవకాశాన్ని కల్పించి … మంత్రి వర్గంలోకి తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారంటున్నారు ..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఇప్పటికే ఈటెల రాజేందర్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా, కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు .. వినోద్ కుమార్ కు మంత్రి పదవి ఇస్తే జిల్లాకు మూడో మంత్రి పదవి ఇచ్చినట్లు అవుతుంది … అయితే వినోద్‌కుమార్ ను ఒక జిల్లా నేతగా చూడకుండా … రాష్ట్రస్థాయిలో పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఉన్న వ్యక్తిగా భావించి మంత్రి పదవి ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది .. ఇప్పటికే వినోద్‌కుమార్ కు ఏదైనా విషయాన్ని చెప్పినట్లయితే … ముఖ్యమంత్రి దృష్టికి ఆ సమాచారన్ని తీసుకువెళ్ళినట్లు అందరూ భావిస్తారు..

వినోద్ కుమార్ తెలంగాణ ఉద్యమ సమయంలో న్యాయపరంగానే కాకుండా … తెలంగాణ ఏర్పాటు కోసం వివిధ పార్టీల మద్దతును కూడగట్టడంలో క్రియాశీల పాత్ర వహించారు.. తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల ఆమలుకోసం వివిధ మంత్రిత్వ శాఖలకు వెళ్ళి … ఆయా మంత్రులను కలిసి పనులు సాధించడానికి … ఎంపిల బృందానికి నాయకత్వం వహించారు.. జాతీయ రహదారులు, స్మార్ట్ సిటీల సాధన, ఎయిమ్స్ తదితర సంస్థల సాధనలో తనవంతు కృషి చేశారు ..

కేంద్రంతో ముడిపడి ఉన్న పలు ఆంశాలు.. ఇంకా పెండింగ్ లో ఉండడంతో వినోద్ కుమార్ సేవలు అవసరమని కేసిఆర్ భావిస్తున్నారంట .. అలాగే వినోద్‌కుమార్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన వెనుక రాజకీయకోణం కూడా కనిపిస్తోందంటున్నారు .. వినోద్‌కు మంత్రి హోదాలో ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు …

ఉద్యమానికి పట్టుకొమ్మలాంటి ఉత్తర తెలంగాణలో బీజేపీ ఎంపి స్థానాలు గెలవడం టిఆర్‌ఎస్‌ శ్రేణులకు పెద్ద షాకే ఇచ్చింది .. అక్కడ పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చుకునే విధంగా.. ఆ జిల్లాల రాజకీయ వ్యవహరలన్నీ వినోద్‌ చేతుల మీదుగా నడిచేలా కేసీఆర్ పావులు కదుపుతున్నారని సమాచారం… ఆ మూడు పార్లమెంట్ స్థానాలు కోల్పోవడానికి పార్టీలో అంతర్గంతంగా కొందరు కారణమని పార్టీ వర్గాలు విశ్లేషించడాన్ని గులాబీబాస్‌ సీరియస్‌గా తీసుకున్నారంట … అందుకే తనకు సన్నిహితుడైన వినోద్‌కు ఆయా జిల్లాల్లో పార్టీ బాధ్యతలు కూడా అప్పజెప్తారంటున్నారు …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here