Home Videos

బ్లాక్ ఫంగస్ ని ఎలా గుర్తించాలి

ఓ వైపు కరోనా.. మరోవైపు బ్లాక్ ఫంగస్ దీంతో దేశం మొత్తం ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా కరోనా వచ్చి తగ్గిపోయిన వారిలో… వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. నీరసంగా ఉండటంతో అలాంటి వారిని బ్లాక్ ఫంగస్ టార్గెట్ చేస్తోంది. ఇది పాత ఇన్ఫెక్షనే అయినప్పటికీ.. ఇండియాలో ఇప్పుడు దీని కేసులు ఎక్కువవుతున్నాయి. అంటువ్యాధి కాకపోయినా.. ఇది వచ్చిన వారికి 24 గంటల్లో ట్రీట్‌మెంట్ అందించకపోతే.. ప్రాణాలకే ప్రమాదం.

కొవిడ్‌ బాధితుల్లో ఎక్కువగా బ్లాక్‌ ఫంగస్‌ బయటపడుతోంది. ఎక్కువగా ఐసీయూలో ఉండడం, ఆక్సిజన్‌, స్టెరాయిడ్స్‌ వాడే వారిలో ఎక్కువగా బ్లాక్‌ ఫంగస్‌ బయటపడుతోందని వైద్యులు చెబుతున్నారు. కళ్లు, ముక్కు ఎరుపెక్కడంతోపాటు తీవ్రంగా నొప్పి చేస్తాయి. జ్వరం, తలనొప్పి, జలుబు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు రక్తపు వాంతులు, మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. ఇలాంటి లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించడంతోపాటు జాగ్రత్తగా ఉండాలని కరోనా స్పెషలిస్ట్ డా.ముఖర్జి చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here