ఒరే బాబూ.. నీకేరా సెప్పేది నాయనా.. అదేంట్రా బాబా అలా ఆవురావురుమని మెక్కేత్తుండావ్.. కూసింత నేను సెప్పేది కూడా ఇన్రా నాయనా! ఓ ఎగబడి మటన్ మెక్కెయబాకురా అయ్యా.. కారనమేంటో సెప్పాలా? హైదరాబాద్ సిటీ మొత్తం పెద్ద హోటల్లలో సెకింగుల సేత్తే.. ఎన్నేసి ఇసయాలు బయట పడ్డాయో తెల్సా? అబ్బబ్బ అడ్డమైన మాసం నిలువునా ఒండేత్తున్నారంట.
జీవాల్ని సపా చేసే చోట డబ్బెక్కువ కర్సవుతుందని దీన్తల్లీ.. ఎక్కడ బడితే అక్కడ సంపేసి ఎలాంటి జాగర్తలు తీసుకోకుండా హోటల్లకు అంపేత్తున్నారంట. దీంతో ఏం జరుగుతోందా తెల్సా? ముసలీ ముతక.. సిన్నా సితకా జీవులన్నీ హరీ అంటున్నాయ్.. నీ పొట్టలో సేరిపోతున్నాయ్ రా బాబా. ఎంతో ప్రెస్ మాంసమే తినాలి. ఇలా అడ్డమైన తిండీ కరిస్తే ఏమైతాదో ఎరకేనా.. జీర్నాసయం, శాసకోస యాదొలొత్తారా అయ్యా.
ఈల్లంతా ఇలా ఎందుకు సేత్తున్నారో తెల్సా.. జీహెచ్ఎంసీ పర్మీసన్లిచ్చిన పశులను సంపే సోటైతే సిన్నోటికి పాతిక.. పెద్ద జీవాలకు ఒంద ఇయ్యాల్సొస్తుందని అందరూ గల్సి జియాగూడా ఎల్తున్నారంట. ఈడ డైలీ ఆరువేల గొర్రెలు మేకలు బలై పోతున్నాయంట. ఈల్లు లేరూ రూలూగీలూ పాటించనే పాటించరంట. తొమ్మిదినెలలు నిండని గొర్రెలు మేకల్ని ఎంత మాత్రం వధించరాదని అంటే ఈల్లియేం నెక్కసేయరంట. అంతే కాదు మూడేళ్లలోపు పెద్ద పశువులు.. అనారోగ్యంతో ఉన్న గొడ్లను సైతం ఏసేస్తారంట. దీంతో ఈడ్నించే చిటీలో ఎక్కువ మాంసం సప్లయ్ అవుతాదంట.
ఈ సోమ్వారం జీహెచ్ఎంసీ అధికారులు నగరమంతా కలయదిరిగి ఆరాదీత్తే తేలిందేంటో తెల్సా.. మీరంతా ఎగబడి తినే హోటెల్లలో ఏఈ సరైన రూలూగీలూ పాటించడం నేదంట. సో బాయ్స్ అండ్ గాల్స్.. బీ అవేర్ ఆఫ్ ఇట్ అన్నది మీరు సివరాకర్లో తెల్సుకోవల్సిన సారాంశం. బిర్యానీ బిర్యానీ అని ఓ ఎగేసుకు తినేయకండి.. ఆనక అడ్డమైన రోగాలతో అల్లాడిపోవాల్సి వత్తాది.