ఒక్కసారి కాస్త పాపులారిటీ వచ్చిందంటే చాలు.. దాన్ని నిలబెట్టుకోడానికి ఎంత దూరమైనా వెళ్తుంటారు కొందరు ముద్దుగుమ్మలు. అందులో ఇప్పుడు బిగ్ బాస్ బ్యూటీ హిమజ కూడా చేరిపోయింది. దానికి ముందు కొన్ని సినిమాలు చేసినా కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. అలాంటి సమయంలో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 3తో ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో రెబల్ కారెక్టర్ తో దుమ్ము దులిపేసింది. కచ్చితంగా ఫైనల్ వరకు వస్తుందని అనుకున్నారు కానీ మధ్యలోనే ఇంటికి పంపేసారు.

అప్పుడు హిమజ ఎలిమినేషన్ పై చాలా వరకు రచ్చ కూడా చేసారు అభిమానులు. అయితే దానికి ముందు చాలా పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం చాలా రచ్చ చేస్తుంది. హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకునే పనిలో పడింది హిమజ. ముఖ్యంగా ఈమె చేస్తున్న ఫోటోషూట్స్ అన్నీ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న హాట్ షో చేసి ఔరా అనిపించిన హిమజ.. ఇప్పుడు మరోసారి ఇదే చేసింది. తాజాగా షర్ట్ ప్యాంట్ చింపుకుని హాట్ హాట్ అందాలన్నీ ఆరబోసింది ఈ భామ. ఎప్పుడూ చక్కగా నిండు బాటల్లో కనిపించే ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే పద్దతులు మార్చుకుంటుంది. షర్ట్, ప్యాంటులు వేసుకుంటూ అందాలు ఆరబోస్తుంది. హాట్ ఫోటోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది హిమజ. ఇవి చూసిన తర్వాతైనా ఏ దర్శకుడు అవకాశం ఇవ్వకపోతాడా అని చూస్తుంది ఈమె. మరి హిమజ కోరిక తీర్చే దర్శకుడు ఎక్కడున్నాడో..?