Home Entertainment Cinema

నేను పవన్ కళ్యాణ్ భక్తురాలు.. బిగ్ బాస్ బ్యూటీ సంచలనం..

పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో అభిమానులతో పాటు భక్తులు కూడా ఉన్నారు. సాధారణంగా ఆయన అంటే ప్రాణం ఇచ్చే అభిమానగణం బయట చాలా ఉంది. ఇక ఇండస్ట్రీలో కూడా పవన్ పేరు చెప్పుకొని ఎప్పటికప్పుడు తమ ఉనికిని చాటుకుంటున్నారు కొందరు. సాక్షాత్తు బండ్ల గణేష్, నితిన్ లాంటి సెలబ్రిటీస్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులం అంటూ వీలు దొరికినా ప్రతిసారి చెబుతూనే ఉంటారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా తనకు కళ్యాణ్ అంటే అభిమానం కాదు పిచ్చి అని అంటుంది. ఆతనంటే తనకు ప్రాణం అంటూ తెగ ప్రేమ చూపించేస్తుంది. ఆమె ఎవరో కాదు బిగ్బాస్ షోతో పాపులర్ అయిన అషు రెడ్డి.

జూనియర్ సమంత అంటూ సోషల్ మీడియాలో బాగానే క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ 3 సీజన్ కి వచ్చి బాగానే రచ్చ చేసింది. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ పేరు వాడుకుని ఓట్లు సంపాదించడానికి మ్యాగ్జిమం ట్రై చేసింది. అయితే అది పెద్దగా వర్కవుట్ కాలేదు. అందుకే 5 వారాల తర్వాత ఇంటికి వచ్చేసింది అషు రెడ్డి. ఇదిలా ఉంటే తాజాగా సుమ కనకాల పోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రాంకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

వచ్చేవారం టెలికాస్ట్ కాబోయే ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది అషు రెడ్డి. పవన్ తో సినిమా చేసే అవకాశం వస్తే వదిలేసుకుంటానని చెప్పి సంచలనం సృష్టించింది ఈ భామ. కానీ దాని వెనక ఒక బలమైన కారణం ఉంది. ఒక టాస్కులో భాగంగా పవన్ కళ్యాణ్ పచ్చబొట్టు తీయించుకుంటావా లేదంటే పవన్ తో నటించే అవకాశం వస్తే వదిలేసుకుంటావా అంటూ సుమ అడిగితే మరో ఆలోచన లేకుండా పవన్ సినిమా వదిలేసుకుంటానంటూ చెప్పింది. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత ప్రేమ అని అడిగితే.. ఆయన దేవుడు నేను ఆయన భక్తురాలిని అంటూ సమాధానం చెప్పింది. మొత్తానికి ఈ ఒక్క సమాధానంతో సోషల్ మీడియాలో అమ్మడుకు ఫాలోవర్స్ బాగానే పెరిగిపోయారు. ఎంతైనా పవన్ కళ్యాణ్ పేరు వాడుకుంటే అంతేమరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here