Home Entertainment Cinema

బిగ్ బాస్ హౌస్ హైలెట్స్…!

15 మంది కలర్ ఫుల్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ 3 హౌస్‌ మంచి జోష్ లో సాగిపోతుంది. దీనికి నాగార్జున హోస్ట్ గా ఉండటం మరో స్పెషల్ ఎస్సెట్ అయింది. ఇక హౌస్ లో 3 రోజుల్లో మూడు వివాదాలు కాకరేపాయి. .. హిమజ, హేమల మధ్య వార్, కిచన్ లో టీకప్పులో తుఫాన్,భాబా భాస్కర్,జాఫర్ కామెడీ పండిస్తుండటం హౌజ్ లో హైలైట్స్…మొత్తానికి మూడురోజులుగా ఫుల్ జోష్ తో నడుస్తుంది సీజన్ 3 రియాలిటిషో.

మొదటగా బిగ్ బాస్ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ చిన్న పిల్లలుగా వ్యవహరించాలని కామెడీ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో మహేశ్ విట్టా కొంచెం వెనకబడ్డారు. మిగిలిన వారు మాత్రం రెచ్చిపోయి పెర్ఫామెన్స్ ఇచ్చారు. ముఖాల నిండా రంగులు పూసుకుని పిల్లలుగా రచ్చ రచ్చ చేశారు. వీరందరికీ టీచర్‌ బాస్ గా పునర్నవి భూపాలం ఉంది. చిన్నప్పటి నుంచి ఇలాంటి వాటిలో నేను సైలెంట్ అంటూ సైలెంట్‌గా ఉండిపోయారు మహేష్.

రవిక్రిష్ణ, రోహిణిల ఓవరాక్షన్,మహేశ్ కలర్ పై చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా హౌజ్ వాతావరణం మారింది. ‘నువ్ అసలు చదువుకున్నావా? మహేష్ గాడు అని అను పర్లేదు.. అంతే కాని కర్రోడు అంటూ కించపరిచేలా మాట్లాడితే బాగోదు’ అని మహేశ్ విట్టా రవికృష్ణకి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. వీరందరికీ టీచర్‌ గా ఉన్న పునర్నవి కల్పించుకుని అక్కడ హాట్ సీన్ ని కూల్ చేసింది. దీంతో రవిక్రిష్ణ.. మహేష్ విట్టాకు సారీ చెప్పాడు.

ప్రస్తుతం ఎలిమినేషన్‌లో ఉన్న హేమ ఎటిట్యూడ్ పై హౌజ్ లో వార్ స్టార్టయింది. కిచెన్‌లో పెత్తనం చేస్తున్న హేమ పై క్రమంగా వాయిస్ పెంచుతున్నారు మిగతా కంటిస్టెంట్స్. కిచెన్‌లో ఉన్నాను కాబట్టి నేను ఏం చేస్తే అదే తినాలి అన్న రేంజ్ లో హేమ పెత్తనం చేస్తుండటంతో సీన్ రివర్సవుతుంది. టీలో షుగర్ తక్కువైందని.. చిక్కగా లేదంటూ రేగిన టీ కప్పులో తుఫాన్ క్రమంగా సీరియస్ లెవల్ కి వెళ్లింది. ఫ్రైడ్ రైస్ విషయంలో అలీ రైజా,హేమా మధ్య మాటల యుద్దం కాస్త ఘాటుగానే సాగింది.

హేమా ప్రవర్తన పై రాహుల్ సిప్లిగంజ్ కూడా వాయిస్ పెంచాడు. హౌజ్ లో ఎవరి ఇష్టాలుండవని హౌస్‌లో ఉన్న 15 మందికి సంబంధం ఉంటుంది. మీ ఇష్టం అంటే కుదరదు అంటూ గట్టిగా వాదించాడు. శ్రీముఖి మినహా.. మిగిలిన కంటెస్టెంట్స్ నుండి హేమ పై వ్యతిరేకత వ్యక్తమైంది. రాహుల్ సిప్లిగంజ్‌ కు మిగిలిన కంటెస్టెంట్స్ సర్ధి చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

ఇక హౌస్‌లో కపుల్ గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్, వితికాలు కొంచెం రోమాన్స్ రేంజ్ పెంచారు. ఐ లవ్ యూ చెప్పడం లేదు,ఎత్తుకోవడం లేదంటూ వరుణ్ తో గారాలుపోయింది వితికా. నన్ను నాగార్జున చెబితే ఎత్తుకున్నావ్.. ఇప్పుడు ఎత్తుకోవడం లేదంటూ నాగార్జున గారికి కంప్లైంట్ చేస్తానని రొమాంటిక్‌గా ముచ్చట్లు సాగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here