Home Entertainment Cinema

బిగ్ బాస్ ఎలిమినేషన్ టెన్షన్…హేమ కి ఎర్త్ పెట్టినట్లేనా…?

మొత్తానికి బిగ్ బాస్ తొలివారం పూర్తైంది. మొదటివారం ఎలిమినేషన్‌కి రంగం సిద్దమవ్వడంతో కంటెస్టెంట్లలో టెన్షన్ పీక్స్ కి వెళ్ళింది. ఉన్న 15 మంది కంటిస్టెంట్లలో వారానికి ఒకరు చొప్పున ఎలిమినేట్ అయ్యేది వారం చివర్లోనే. ఈవారం రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. హోస్ట్ నాగార్జున ఈరోజు దగ్గరుండి ఎవరిని సాగనంపుతారా అన్న టెన్షన్ ఇప్పుడు కంటిస్టెంట్ల గుండెల్లో గుబులు రేపుతుంది.

మాస్ అంటూ మోడల్స్‌తో స్టెప్పులేస్తూ ఫుల్ జోష్ లో నాగర్జున ఎంట్రీతో రసవత్తరంగా సాగింది ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్. ఇక అభిమానులను షాక్ కి గురి చేసే పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఎంతో గంభీరంగా ఉండే జాఫర్ భార్య గుర్తుకు వచ్చిందని ఎమోషనల్ అయ్యాడు…ఇక్కడి వాతావరణం నాకు సెట్ కావడం లేదని బావురుమన్నాడు. మరో పక్క తీన్మార్ సావిత్రి ఎమోషనల్ లవ్ స్టోరీ కూడా అందరి హార్ట్ ని టచ్ చేసింది. బాత్ టబ్‌లో రొమాంటిక్ ముచ్చట్లతో గారాలు పోయారు వరుణ్, వితికాలు.

మన టీవీ ద్వారా కంటెస్టెంట్స్‌ను పలకరించిన నాగ్.. అందరిని పలకరిస్తూ జోష్ నింపాడు. ఎమోషనల్ అయి ఏడుస్తున్న జాఫర్ ని చూసి ముఖాముఖి జాఫరేనా అంటూ సముదాయించాడు నాగ్. రోజు బాబా భాస్కర్ తో సైలెంట్ కామెడీ చేస్తున్న జాఫర్ కన్నీళ్లు పెట్టుకోవడంతో శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్‌లు ఓదార్చారు. ఇక జాఫర్ తో బాబా భాస్కర్ వేయించిన మూన్ వాక్ స్టెప్పులు హైలెట్ అయి నవ్వులు కురిపించాయి.

ఇక చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి తన భర్త గురించి చెబుతూ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టింది. ఊరి నుంచి పారిపోయి వచ్చిన తనను తన భర్త గొప్పగా చూసుకున్నాడని తన తండ్రిని కూడా ఒక కొడుకుగా ఆదరించాడంది. ఇలాంటి భర్త ప్రతి అమ్మాయికి దొరకాలని కన్నీళ్ల పర్యంతమైంది.

నేను ఎలిమినేట్ అయితే ఏం చేస్తావ్.. అంటూ వితికా రొమాంటిక్ మూడ్‌లో వరుణ్ ని కవ్వించగా ఆకలిగా ఉంది బ్రెడ్ ముక్కలు కావలంటూ వరుణ్ డైవర్ట్ చేశాడు. మమ్మల్ని విడదీయోద్దు బిగ్ బాస్ అంటూ ఎమోషనల్ గేమ్ ప్లే చేసింది వితికా.

ఎలిమినేషన్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లలో హిమజా సేఫ్ అంటూ నాగర్జున తేల్చేయడంతో షరా మాములుగా ఏడ్చేసింది హిమజా. ఇక కేరాఫ్ కాంట్రవర్సిగా ఉన్న వితికా కూడా సేఫ్ గానే కనబడుతుంది. హౌస్ లో కావల్సినంత ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్న వితికాను పంపే చాన్స్ కుడా కనబడట్లేదు. షో టాప్ రేటింగ్‌లో నడవాలంటే ఇలాంటి వాళ్ళు చాలా అవసరం కాబట్టి ఈ కపుల్ సేఫ్. గ్లామర్ పరంగా పునర్నవి, హిమజాలు సేఫ్. అన్నట్లు చపాతికోసం రచ్చ చేసిన పునర్నవికి చపాతి పంపాడు నాగ్.

ఇక బాబా భాస్కర్‌తో జాఫర్ ఎంటర్‌టైన్ చేస్తుండటంతో ఈయన కూడా సేఫ్ జోన్ లో ఉన్నట్లే… ఇక మిగిలింది హేమ, రాహుల్ సిప్లిగంజ్ …హౌస్ లో స్టార్టింగ్ నుంచి వార్ నడుస్తుంది వీరిద్దరి మధ్యే. హేమ బిహేవియర్ పట్ల అంత పాజిటివ్ నెస్ లేదు.

హౌస్ లోని‌ సభ్యులతో‌ కూడా హేమ వ్యవహరించిన‌ తీరు పట్ల కూడా వ్యూయర్స్ లో వ్యతిరేకత‌ వ్యక్తమవుతుంది.సో ఈ చొప్పున చూసుకుంటే ఈవారం బిగ్ బాస్ హౌస్‌ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశం‌ హేమా కే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here