Home Videos

ఈటెలకి తప్పిన పెను ప్రమాదం

ఈటల రాజేందర్‌ బృందానికి ప్రమాదం తప్పింది. ఈటల బృందం ఢిల్లీ నుంచి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య చోటు చేసుకుంది. దీంతో పైలట్‌ అలెర్ట్‌ అవ్వటంతో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్‌ సమయంలో సాంకేతిక సమస్యను పైలట్‌ గుర్తించాడు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఈటల బృందం బయల్దేరింది.

టేకాఫ్ సమయంలో రన్ వేపై ఉండ‌గా సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు. గాల్లోకి లేచే టైంలో అప్ర‌మ‌త్త‌మై ఫైలెట్ విమానాన్ని ఆపేశాడు. విమానంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘనందన్, మాజీ ఎంపీ వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమాతో పాటు మొత్తం 184 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here