Home News

ఈటల రాజేందర్‌ వెనుక భారీ కుట్రకోణం

టీఆర్‌ఎస్ లో మంత్రి ఈటల రాజేందర్‌ వ్యవహారం పెను దుమారాన్ని రేపుతుంది. కొంతకాలంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సఖ్యత లేని ఈటలను పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారా అన్న చర్చ నడుస్తుంది. ఈటల రాజేందర్ ను బలి చేయడం వెనుక భారీ కుట్రకోణం నడిచిందా..కేసీఆర్ హిట్ లిస్ట్ లో ఉన్న అధికారపార్టీ నేతలు ఇంకెంతమంది ఉన్నారు వీరి పై ఎలా స్పందిస్తారన్న దానిపై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి సంచలన విషయాలు చెప్పారు.

ఈటల పై వ్యూహం ప్రకారం అధికార పార్టీ సొంత టీవీ చానల్‌ టీ న్యూస్‌ సహా ప్రభుత్వానికి అనుకూలం అనే పేరున్న మూడు టీవీ చానల్స్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ భూ కబ్జాకు పాల్పడినట్లు వరుస కథనాలు వచ్చాయి. ఇక ఈ వ్యవహర పై అంతే స్పీడుగా స్పందించారు సీఎం కేసీఆర్. విచారణకు ఆదేశించినట్లు ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ఇవన్నీ ఒకే రోజు గంటల వ్యవధిలో వెంటవెంటనే చోటుచేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here