Home Entertainment Cinema

బిగ్ బాస్ లో ఇక దీప్తి వంతు…ఫేక్ ఓటింగ్ తో దీప్తికి ఎర్త్ పెట్టారా…?

బిగ్ బాస్ షో-2…..ఏదైనా జరగొచ్చు…ఈ సారి ఇంకొంచెం మసాలా…అని నాని చెప్పినట్లుగానే ఈ సారి షోలో అనూహ్య పరిణామాలు జరగడంతో పాటు మసాలా డోస్ కూడా పెరిగిందని టాక్ ఉన్న సంగతి తెలిసిందే. ఎలిమినేట్ అవుతారనుకున్న వారు షోలో కొనసాగడం…. …కొనసాగుతారుకున్నవారు ఎలిమినేట్ కావడం తెలిసిందే. ఇక గ్రాండ్ ఫినాలే దగ్గరపడే కొద్దీ షోపై ఆసక్తి పెరుగుతోంది. మరో 3 రోజుల్లో రెండో సీజన్ కు శుభం కార్డ్ పడబోతోన్న నేపథ్యంలో అనూహ్యంగా ఓ కంటెస్టెంట్ ఎలిటిమినేట్ కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఓటింగ్ పరంగా రెండో స్థానంలో కొనసాగుతోన్న దీప్తి నలమోతు…షో నుంచి ఎలిమినేట్ కాబోతోందని పుకార్లు వస్తున్నాయి. ఓటింగ్ విషయంలో కౌశల్ మొదటి స్థానంలో ఉంటే దీప్తి రెండో స్థానంలో ఉంది. కానీ అనూహ్యంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో దీప్తిపై వేటు వేయాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడట. నెక్స్ట్ ఎపిసోడ్ లో దీప్తి ఎలిమినేట్ కాబోతోందని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది.

ఫేక్ ఓటింగ్ వల్లే దీప్తి ఎలిమినేట్ కానుందని పుకార్లు వస్తున్నాయి. అదీకాకుండా నలుగురు కంటెస్టెంట్ల మధ్యే ఫైనల్ ఉండాలని బిగ్ బాస్ నిర్ణయించుకున్నాడట. అంతకుముందు దీప్తి ఎలిమినేషన్ కోసం కౌశల్ ఆర్మీ ఫేక్ ఓట్లను వేస్తోందని పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎలిమినేషన్ గురించి వచ్చిన లీకులన్నీ దాదాపుగా నిజమైన నేపథ్యంలో దీప్తి ఎలిమినేషన్ వార్త చర్చనీయాంశమైంది. మరి దీప్తి నిజంగా ఎలిమినేట్ అవుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here