Home Entertainment Cinema

బిగ్ బాస్ నుంచి హేమా ఔట్ తమన్నా ఇన్…ఓటింగ్ అంతా చీటింగ్ అంటున్న హేమా…!

బిగ్ బాస్ షో లో తొలి ఎలిమినేషన్ పూర్తైంది. అందరు అనుకున్నట్లే హేమా ని హౌస్ నుంచి సాగనంపారు. మొత్తం 15 మంది కంటెస్టెంట్లలో రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమ నామినేట్ అవ్వగా అందరు సేఫ్ అవుతూ చివరిగా వేటు హేమా పై పడింది. ఇక ‘మన్మథుడు 2’ సాంగ్ తో సండే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు నాగ్. స్టోర్ రూం నుంచి టాస్క్ లతో మంచి ఫన్ క్రియోట్ చేసిన నాగ్ చివరిగా హేమా ని ఎలిమినేట్ చేసి తమన్న సింహాద్రికి హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు…ఇక ఎలిమినేషన్ తర్వాత కూల్ గా ఉన్న హేమ ఆ తర్వాత ఓటింగ్ అంతా చీటింగ్ అంటూ సంచలన కామెంట్స్ చేశారు….

మన టీవీతో కంటిస్టెంట్లకు హాయ్ చెప్పిన నాగ్ ఎలిమినేట్ జోన్ లో ఉన్న హిమజ, పునర్నవి సేఫ్ చేశారు. ఇక హౌస్ లో లేడీస్ అంతా చీరలతో దర్శనమివ్వడంతో కాంప్లిమెంట్స్ ఇచ్చాడు ఇక తన మార్క్ వెరైటీ టాస్క్ లతో సందడి చేశాడు నాగర్జున.
15 మంది హౌజ్‌మేట్స్‌కి మూడు రంగుల పేపర్లు ఇచ్చి ఒక్కో పేపర్‌పై గుడ్, యావరేజ్, బ్యాడ్ అనిపించే ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు రాయాలని సూచించారు. వాటిని కేటగిరి ప్రకారం బౌల్ లో వేయాలన్నాడు.

ఆ తర్వాత 15 మంది కంటెస్టెంట్లను ఐదుగురు చొప్పున మూడు గ్రూపులుగా విడదీసి ఒక్కో గ్రూపు నుంచి ఒకరిని యాక్టర్‌గా ఎంపిక చేసుకోవాలని సూచించారు. రోహిణి, వితికా, శ్రీముఖి ఒక్కో గ్రూపు నుంచి యాక్టర్లుగా ఎంపికయ్యారు. వీరిలో ఒకరు వచ్చి బౌల్‌లో ఉన్న చిట్టీని తీసి దానిమీద రాసున్న పాటను కెమెరాకు చూపి టీమ్ మెంబర్స్ కి సైగలతో చెప్పాలి. ఒక్కోక్క టీమ్ కి ఐదు పాటలిచ్చి చేయించిన ఈ టాస్క్ మంచి జోష్ నింపింది. ఈ గేమ్ లో రోహిణి టీం విక్టరీ కొట్టింది. ఇక తర్వాత గుడ్, యావరేజ్, బ్యాడ్ రాసిన బౌల్ ఓపెన్ చేయించి కంటిస్టెంట్స్ గుట్టు విప్పాడు నాగ్.

హౌజ్‌మేట్స్‌లో ఎక్కువ మంది బాబా భాస్కర్‌కు ‘‘గుడ్’’ అని ఓటు వేశారు. యావరేజ్‌ లో జాఫర్‌‌ పేరు రాగా బ్యాడ్ అని ఎక్కువ మంది హేమ పేరు రాశారు. ఇక హౌజ్‌లో ఉన్న వారే కాకుండా ప్రేక్షకుల్లో ఎక్కువ మంది హేమను ఎలిమినేట్ చేస్తూ ఓట్లు వేశారని నాగార్జున డైరెక్ట్‌గా ప్రకటించేశారు. మొత్తం 1.30 కోట్ల మంది ఓటు వేయగా ఎక్కువ మంది హేమా కి వ్యతిరేకంగా వేయడంతో హేమ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. హౌజ్‌లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో విన్నింగ్ ఎవరు? కన్నింగ్ ఎవరు? అని హేమాని నాగర్జున అడగ్గా విన్నింగ్ రేసులో శ్రీముఖి, బాబా భాస్కర్ ఉన్నట్లు తెలిపింది. కన్నింగ్ ఎవరు లేరని అంతా మంచి వాళ్లే అంది హేమా.

హౌజ్‌లో నుంచి హేమ ఎలిమినేట్ అయినా మళ్లీ 15 మంది కంటెస్టెంట్లు అయ్యారు. ప్రముఖ ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఆమెను నాగార్జున 15వ కంటెస్టెంట్‌గా పరిచయం చేశారు. అయితే ప్రస్తుతం తమన్నాను హౌజ్‌లోకి పంపలేదు. బిగ్ బాస్ చెప్పినప్పుడు హౌజ్‌లోకి వెళ్లాలని, అప్పటి వరకు వెయిట్ చేయాలని తమన్నాకు నాగార్జున చెప్పారు.

ఇక హౌస్ లో అందరి పై పెత్తనం చేసిన హేమ ని సాగనంపడంతో ఆమె బయటకు వచ్చి ఎమోషన్ అయ్యారు. బయటకు వచ్చాక మాత్రం బిగ్ బాస్‌పై ఫైర్ అవుతున్నారు. బిగ్ బాస్ ఓటింగ్‌పైన ఎలిమినేషన్ ప్రక్రియ పైన సంచలన కామెంట్స్ చేశారు హేమ. ఎలిమినేషన్ విధానం సరిగా లేదని గూగుల్‌లో కాకుండా హాట్ స్టార్ ద్వారా ఓటు వేసే విధానంలో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యారంటున్నారు. తన పై వివక్ష చూపారంటూ ఫైరైంది. ఇక మూడో సీజన్‌తో హేమ ఎలిమినేట్ కావడంతో.. బిగ్ బాస్ మూడు సీజన్లలలో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్స్ ముగ్గురూ మహిళలే కావడం విశేషం.
సీజన్ 1లో జ్యోతి తొలి ఎలిమినేషన్ కాగా.. సీజన్ 2లో సంజనా అన్నే ఎలిమినేట్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here