Home Entertainment Now Showing

భీష్మ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. నితిన్ కుమ్మేసాడు బాబోయ్..

నితిన్ సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఒక్కోసారి ఓపెనింగ్స్ విషయంలో చాలా వెనుకబడిపోతుంటాడు. కానీ భీష్మ విషయంలో మాత్రం జరగడం లేదు. ఈ సినిమా సందడి లేకుండా వచ్చి సంచలనాలు సృష్టిస్తుంది. మూడు రోజుల్లో ఏకంగా 19 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్లు.. మిగిలిన అన్ని చోట్ల మరో 4 కోట్ల షేర్ వసూలు చేసి పెట్టుబడిలో 90% వెనక్కి తీసుకు వచ్చింది. మరో మూడు కోట్లు వస్తే ఈ సినిమా హిట్ ఖాతాలో చేరిపోతుంది. ప్రస్తుతం మార్కెట్లో మరో సినిమా లేకపోవడంతో భీష్మ బ్లాక్ బస్టర్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈయన దెబ్బకు థియేటర్స్ అన్నీ నవ్వులతో మునిగిపోతున్నాయి.

గురువు పేరు నిలబెడుతూ వెంకీ కుడుముల కూడా త్రివిక్రమ్ మార్క్ పంచ్ లతో భీష్మ సినిమా తెరకెక్కించాడు. తొలి రోజు ఈ సినిమా దాదాపు 8 కోట్ల షేర్ వసూలు చేసింది. పాజిటివ్ టాక్ ఉండటంతో రెండు మూడు రోజులు కూడా ఇదే దూకుడు కొనసాగింది. మార్నింగ్ మ్యాట్నీ అనే తేడా లేకుండా అన్ని షోలు హౌస్ ఫుల్ అయిపోయాయి. మూడో రోజు కూడా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇప్పటికే వన్ మిలియన్ వైపు పరుగులు పెడుతుంది భీష్మ. నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అన్ని అర్హతలు ఈ సినిమాకు ఉన్నాయి.

సంక్రాంతి సినిమాల తర్వాత బోసిపోయిన బాక్సాఫీస్ ను తన సినిమాతో మళ్లీ పరుగులు పెట్టిస్తున్నాడు నితిన్. నాలుగేళ్లుగా ఒక్క విజయం కూడా లేని ఈ హీరో ఇప్పుడు భీష్మ సినిమాతో తన ఆకలి మొత్తం తీర్చుకుంటున్నాడు. వెంకీ కుడుముల కూడా రెండేళ్ల గ్యాప్ తీసుకుని పక్క స్క్రీన్ ప్లే తో వచ్చాడు. దానికి తోడు సేంద్రియ వ్యవసాయం అంటూ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకుని.. దాన్ని వినోదాత్మకంగా ప్రెజెంట్ చేశాడు. వీలైనంత వరకు కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తూ మరోవైపు అద్భుతమైన సందేశం కూడా ఇచ్చాడు. మూడు రోజుల వీకెండ్ దొరకడంతో 19 కోట్ల మార్కు అందుకోవడంతో ఫుల్ రన్ లో ఖచ్చితంగా 35 కోట్ల షేర్ తీసుకొచ్చేలా కనిపిస్తుంది. ఇదేగాని జరిగితే పెళ్లికి ముందు నితిన్ కు వెంకీ కుడుముల అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినట్లే. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే.. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ సినిమాలు చేస్తున్నాడు నితిన్. వీటితో పాటు అందధూన్ తెలుగు రీమేక్ లో కూడా ఈయన హీరోగా నటిస్తున్నాడు. మొత్తానికి ఒక్క సినిమాతో మళ్లీ తన సత్తా నిరూపించుకున్నాడు నితిన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here