Home News Updates

బెంగాల్ సీఎం మమతా ఇంట తీవ్ర విషాదం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో ఆమె సోదరుడు అషీమ్ బెనర్జీ కన్నమూశారు. దాదాపు నెల రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. మెడికో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేర్పించారు. అప్పటి నుంచి అషీమ్ అక్కడే చికిత్స పొందుతున్నాడు. అయితే పరిస్థితి విషమించడంతో.. అషీమ్ మే 15న మృతిచెందారు.

అషీమ్ మరణించిన విషయాన్ని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అలోక్ రాయ్ ధ్రువీకరిచారు. ఇక అషీమ్ బెనర్జీ.. కాళీ ఘాట్ ప్రాంతంలో నివాసం ఉండేవారు. అతని స్థానికులు ఖాలీదా అని పిలిచేవారు. కోవిడ్ నిబంధనల ప్రకారం శనివారం అషీమ్ బెనర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం 1,31,792 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 9,50,017 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 12,993 మంది కరోనాతో మృతిచెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here