Home News

కేసీఆర్ గాంధీ ఆస్పత్రికి రావడమే ఒక వింతలా మారిందా

సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రి పర్యటనపై తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ గాంధీ ఆస్పత్రి సందర్శన ఒక పబ్లిసిటీ స్టంట్ అన్నారు. సీఎం ఫాం హౌస్ విడిచి రాక రాక బయటకు వస్తే అదోక వింతలా మారిందన్నారు. గాంధీ ఆస్పత్రిలో గంటసేపు హడావిడి చేసి వెళ్తే అక్కడ ఒక్క సమస్య అన్న పరిష్కారం అయిందా అని ప్రశ్నించారు. ఏడేళ్ల పాలన ముఖ్యమంత్రి తొలిసారి బయటకు వచ్చి అదేదో గొప్ప విషయంగా చెప్పుకోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు.

గాంధీ ఆస్పత్రిలో సిబ్బంది లేరని అక్కడ వెంటిలేటర్లు పనిచేయడం లేదన్న విషయాన్నికనీసం గాంధీ ఆస్పత్రి పర్యటనలో కేసీఆర్ గుర్తించారా అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కరోనా వస్తే కార్పోరేట్ దవాఖానాలు గుర్తోస్తాయి. సామాన్యుడి కి మాత్రం గాంధీ ఆస్పత్రే దిక్కన్నారు. గాంధీ ఆస్పత్రి సిబ్బంది తమ సమస్యలు చెప్పుకుంటుంటే వాటిని వినకుండా నేరుగా కలవమని సీఎం చెప్పినట్లు తెల్సిందని… మంత్రులకే సీఎం కేసీఆర్ అందుబాటులో ఇక వారికి అపాయింట్ మెంట్ లభించేది ఎప్పుడన్నారు. సీఎం,వైద్య సిబ్బందికి 10 శాతం ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి ఏడాది గడిచినా అతిగతీ లేదన్నారు. ఇక కరోనా చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు. కరోనా పేరుతో కార్పోరేట్ ఆస్పత్రులను పేదలను దోచుకుంటున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here