Home News

తెలంగాణ వచ్చాక నీళ్లు ఫామ్ హౌజ్ కు..నిధులు సీఎం అనుచరులకు

నీళ్లు నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది..కానీ తెలంగాణ వచ్చాక నియామకాలు ఆయన ఫ్యామిలకే పరిమితమయ్యాయని ఫైర్ అయ్యారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తొలి దశ, మలి దశ ఉద్యమానికి ఊపిరే యువత ఆ యువత తెలంగాణ ఏర్పడ్డాక 7 ఏళ్లుగా ఉద్యోగం లేక, ఉపాధి లేక అల్లాడుతోంది ..లక్షలాది మంది యువతీ, యువకులు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి పడిగాపులు కాస్తున్నారు ఉద్యోగాల కోసం ఎదురు చూసీ, చూసీ చాలా మంది వయసు కూడా దాటిపోయిందన్నారు బండి సంజయ్. ఇక 2018 నుంచి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారన్నారు.

రాష్ట్రంలో ఉద్యోగాల కోసం 25 లక్షల మంది TSPSC లో రిజిస్టర్ చేసుకున్నారని పదవి విమరణ పొందిన మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారని..2.90 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని బిస్వాల్ కమిటీ ప్రకటించిందని నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అని సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడ్డాక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయలేదు. గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అవగానే 50 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వస్తోందని ఝూటా మాటలు చెప్పి యువతను మోసం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు పీఆర్సీ ఇస్తామని ప్రకటించినా ఇప్పటిదాకా ఆ ప్రక్రియ పై ఇప్పటికి అతిగతి లేదన్నారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగాలొస్తాయనుకుంటే దాదాపు 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని రోడ్డున పడేశారు. ఇప్పటికైనా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి అని సీఎం కేసీఆర్ ని డిమాండ్ చేశారు బండి సంజయ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here