Home Entertainment Television

విడుదలైన 50 రోజుల్లోపే బాలయ్య రూలర్ టీవీలోకి..

ఈ రోజుల్లో ఒక పెద్ద సినిమా విడుదలైన తర్వాత నెలరోజుల్లోనే అమెజాన్, నెట్ఫ్లిక్స్ అంటూ అన్నిట్లోనూ వచ్చేస్తున్నాయి. కానీ ఇప్పటికీ కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన కొన్ని వారాలకే టీవీలో వస్తుంటాయి. అది చూసి అభిమానులు కూడా షాక్ అవుతుంటారు. ఇప్పుడు బాలకృష్ణ రూలర్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. డిసెంబరు 20న ఈ సినిమా విడుదలైంది. కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించిన రూలర్ ప్రేక్షకులను అస్సలు ఆకట్టుకోలేకపోయింది. బాలయ్య కెరీర్ లో వరుసగా మూడో డిజాస్టర్ గా నిలిచిపోయింది ఈ సినిమా.

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని బాలయ్య చేసిన ప్రయత్నం అత్యంత దారుణంగా నిరాశపరిచింది. థియేటర్లోనే 10 కోట్లు కూడా తీసుకు రాలేదు రూలర్. అయితే ఈ సినిమాను భారీ రేటు పెట్టి జెమినీ టీవీ శాటిలైట్ రైట్స్ తీసుకుంది. వీలైనంత త్వరగా ప్రీమియర్ వేయకపోతే కచ్చితంగా భారీ నష్టాలు తప్పవని విడుదలైన 50 రోజుల్లోపే టీవీలో ప్రదర్శించారు. ఇంకా బయట ఒరిజినల్ ప్రింట్ రాకపోవటంతో తొలిసారి శాటిలైట్ చేస్తున్నారు..

కాబట్టి మంచి రేటింగ్ వస్తుందని ఆశిస్తున్నారు జెమినీ టీవీ యాజమాన్యం. ఇతర చానల్స్ లో కూడా కొత్త సినిమాలేవీ లేకపోవడంతో కచ్చితంగా రూలర్ టీవీలో మంచి రేటింగ్ తెస్తుందని వారు బలంగా నమ్ముతున్నారు. సోనాల్ చౌహాన్, వేదిక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నటించారు. భూమిక ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. రొటీన్ కమర్షియల్ సబ్జెక్టుతో వచ్చిన రూలర్ సినిమా బాలయ్య అభిమానులను భారీగా నిరాశపరిచింది. మరి ఈ సినిమా టీవీలో ఎంత వరకు ప్రేక్షకులను ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here