Home Entertainment Cinema

బాల‌య్య‌ది దుస్సాహ‌స‌మేనా?

ఎన్టీఆర్‌ బ‌యోపిక్‌కి స్వీయ ద‌ర్శ‌క‌త్వ‌మా!

ఎన్నో సుమోల్ని ఏక‌కాలంలో గాల్లోకి లేప‌గ‌ల‌డు. దూసుకొచ్చే రైలుని చిటికేసి రివ‌ర్స్‌లో వెళ్లేలా చేయ‌గ‌ల‌డు. కంటిచూపుతో చంపేయ‌గ‌ల‌డు. అందుకే ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌కు ఎవ‌రు ఎదురెళ్లినా వాళ్ల‌కే రిస్క్‌..ఆయ‌న ఎవ‌రికి ఎదురొచ్చినా వారికే రిస్క్‌. కోప‌మొచ్చిందంటే చ‌చ్చిన‌వాడ్ని కూడా బ‌తికించి మ‌ళ్లీ చంప‌గ‌ల‌డు తేడాసింగ్‌. ఇన్ని షేడ్స్ ఉన్న హీరో తెలుగు ఇండ‌స్ట్రీలో ఎవ‌రంటే వ‌న్ అండ్ ఓన్లీ బాల‌కృష్ణ‌. నాటోన్లీ ఆన్ స్క్రీన్‌. లొకేష‌న్‌లో ఉన్నా, బ‌య‌ట ఉన్నా ఆయ‌న‌దో సెప‌రేట్ స్ట‌యిల్‌.
ఎన్టీఆర్ బ‌యోపిక్‌. న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క‌రామ‌రావు జీవితంపై బ‌యోపిక్ తీయాల‌నే ఆలోచ‌న ఇప్ప‌టిదికాదు. ఎప్ప‌ట్నించో న‌లుగుతోంది. ఓప‌క్క సావిత్రి జీవిత నేప‌థ్యంలో మ‌హాన‌టి రిలీజై సూప‌ర్‌డూప‌ర్ హిట్ అనిపించుకున్నా…ఎన్టీఆర్ బ‌యోపిక్ మీద మాత్రం క్లారిటీ లేదు. తీయడం ఖాయం. కాక‌పోతే పిల్లిమెడ‌లో గంట క‌ట్టేదెవ‌ర‌న్న‌ట్లే ఉంది అన్న‌గారి బ‌యోపిక్ వ్య‌వ‌హారం. ఎందుకంటే తీయాల్సింది బాల‌కృష్ణ‌తో. పైగా ఆయ‌న తండ్రిగారి బ‌యోపిక్‌. స్క్రిప్ట్ రాసేసుకుని యాక్ష‌న్ అన‌గానే కెమెరాముందుకొచ్చి డైలాగ్ చెప్ప‌డంతో ఆగిపోడు బాల‌య్య‌. అందులో ఏముండాలో, ఎలా ఉండాలో అన్నిట్లో ఆయ‌న వేలుపెట్టి తీర‌తారు. ఇక ఆ మార్పులు చేసుకుంటూ పోతే సినిమా కిచిడీగా త‌యారుకావ‌డం ఖాయం.
బాల‌కృష్ణ‌తో ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి క్లాప్ కొట్టించిన తేజ సారీబాస్ అంటూ ప‌క్క‌కి వెళ్లిపోయాడు. బాల‌య్య‌ని భ‌రించ‌లేమ‌ని చెప్ప‌లేరుగా. ఎన్టీఆర్ సిన్మాకి తాను న్యాయం చేయ‌లేన‌ని తెలివిగా త‌ప్పుకున్నాడు తేజ‌. ఎన్టీఆర్ జీవితంలో ల‌క్ష్మిపార్వ‌తి ఎపిసోడ్ విష‌యంలో బాల‌య్య‌-తేజ‌ల మ‌ధ్య తేడాకొట్టింద‌ని చెప్పుకున్నారు. బ‌యోపిక్ అన్నాక ఆడియెన్స్ ప్రతీదీ సూక్ష్యంగా ప‌రిశీలిస్తారు. అంద‌రికీ తెలిసిన చ‌రిత్ర‌ని చెప్ప‌క‌పోయినా, వ‌క్రీక‌రించినా సిన్మా తేలిపోతుంది. అసలే రాక‌రాక నేనే రాజు..నేనేమంత్రితో ఓ హిట్‌ని త‌న ఎకౌంట్‌లో వేసుకున్న తేజకి…బాల‌య్య‌తో బ‌యోపిక్ పెట్టుకోవ‌డ‌మంటే పులి నోట్లో త‌ల‌పెట్ట‌డ‌మేన‌ని తెలిసిపోయింది. దీంతో తెలివిగా త‌ప్పుకున్నాడు.


ఎన్టీఆర్‌లాంటి మ‌హాన‌టుడి జీవిత‌చ‌రిత్ర‌ని రెండున్న‌ర‌గంట‌ల్లో తెర‌కెక్కించే దుస్సాహ‌సం తాను చేయ‌లేన‌ని ద‌ర్శ‌కేంద్రుడి లాంటివాడే చెప్పేశాక ఆ బాధ్య‌త నెత్తినేసుకునేవారు ఎవ‌ర‌న్న‌దే ప్ర‌శ్న‌. మ‌హాన‌టిని అద్భుతంగా తెర‌కెక్కించి నాగ్ అశ్విన్‌కి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంద‌న్న చ‌ర్చ కూడా వ‌చ్చిందంటే ద‌ర్శ‌కుడి విష‌యంలో ఎంత క‌న్‌ఫ్యూజ్ న‌డుస్తోందో అర్ధ‌మైపోతుంది.
అరె మామా..ఏక్ పెగ్‌లా అంటూ చివ‌రికి పాట‌లు కూడా పాడేస్తున్న బాల‌కృష్ణ అన్న‌గారి బ‌యోపిక్‌కి తానే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌నుకుంటున్నాడ‌నే ప్ర‌చారం ఇండ‌స్ట్రీని షేక్ చేస్తోంది. కాక‌పోతే సింగిల్ హ్యాండ్‌తో అంతా తానే చేయ‌లేడు కాబ‌ట్టి ‘ఆ నలుగురు’ డైరెక్ట‌ర్ చంద్ర‌సిద్ధార్ధ్ సాయం తీసుకుంటున్నాడ‌ని టాక్‌.

అయితే మ‌హాన‌టుడి బ‌యోపిక్ వ్య‌వ‌హారం ఆషామాషీకాద‌ని ఈమ‌ధ్య ఛాన్సులు క‌రువైన చంద్ర‌సిద్ధార్ధకి తెలుసు. అందుకే క‌నీసం ఓ మూడ్నెల్ల‌యినా వ‌ర్క‌వుట్ చేయాల్సి ఉంటుంద‌ని బాల‌య్య‌కి చెప్ప‌డం..న‌ట‌సింహా ఓకే చెప్పేయ‌డం జ‌రిగిపోయింది. అంటే ఓ మూడ్నెల్ల‌పాటు బ‌యోపిక్ ఊసు లేన‌ట్లే. ఈలోపు బాల‌య్య వీవీ వినాయ‌క్ డైరెక్ష‌న్‌లో సి.క‌ళ్యాణ్ సిన్మాకి జెండా ఊపాడు. అయితే వ‌ర‌స‌గా రెండు ఫ్లాపుల‌తో డిఫెన్స్‌లో ప‌డ్డ వినాయ‌క్‌…బాల‌య్య‌తో సిన్మా అంటే ఎక్స్‌పెక్టేష‌న్స్ ఎక్కువుంటాయ‌ని ఓ మూడ్నెల్ల టైం అడిగాడ‌ని టాక్‌. సో…మూడ్నెల్లు బాల‌య్య ఖాళీనే. ఈలోపు బావ‌గారి పోరాటానికి మ‌ద్ద‌తు ప‌లికి మోడీని మ‌న‌సారా తిట్టేసుకోవ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here