Home News

జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై బాలకృష్ణ సెన్సేషన్ కామెంట్స్

బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా ఓ మీడియా చానల్ ఇంటర్యూలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నదానిపై తనకు బాధ లేదంటూనే అతని రాకతో పార్టీకి నష్టం జరిగితే ఏంటని ప్రశ్నించారు. లాభం తో పాటు ఆతర్వాత నష్టం జరిగితే ఏంచేస్తారని ఎదురు ప్రశ్నించారు. ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలి..పార్టీ పగ్గాలు తీసుకోవాలని చాలామంది అంటున్నారు. అయితే ఎవరి ఆలోచనలు వాళ్లవి.. ఎవరి ఇష్టా ఇష్టాలు వాళ్లవి. వాళ్ల ఇష్టాన్ని బట్టే మాట్లాడతారు. కావాల్సింది ఎంచుకుంటారు అన్నారు.

రాజకీయాల విషయానికి వస్తే నా ఇద్దరు అల్లుళ్లు బాగా చదువుకున్న వాళ్లు తెలివైన వాళ్లు. లోకేష్ ,శ్రీ భరత్ అందరితో కలిసిపోతారని మంచి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకా ఎదుగుతున్నారన్నారు. వారు ఇంకా మెచ్యూర్ అవ్వాలన్నారు. ఇక రామారావుగారి గురించి మాట్లాడుతూ.. ‘ఏదో రామారావుగారు సీఎం అయ్యారుగా.. ఆయన సినిమాల్లో ఉన్నారుగా అని అన్నీ అవ్వాలంటే కావు. తెలుగుదేశం పార్టీ ఒక ఆవేశంలో నుంచి పుట్టింది.. అంతేతప్ప వేరే విధంగా రాలేదు. తెలుగు దేశం కార్యకర్తలు కూడా చాలా నిబద్ధతతో ఉంటారు.. అలాంటి వాళ్లకే పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది. యువతని ఎంకరేజ్ చేయాలని గతంలో కూడా చెప్పాను ఇప్పుడూ చెప్తున్నా’.. అన్నారు.

ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే.. తెలుగుదేశం బలపడుతుందని.. ముఖ్యంగా యువతలో చైతన్యం వస్తుందని టీడీపీ కార్యకర్తలు భావిస్తుండగా.. బాలయ్య మాత్రం తన అల్లుళ్లు సమర్ధులు అంటూనే.. ఎన్టీఆర్ వల్ల నష్టం చేకూరే ప్రమాదం ఉందని అనడంతో ఆయన అంతరంగం ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here