Home Entertainment Cinema

బాలయ్య బర్త్ డే ఈ సారి వెరి వెరీ స్పెషల్..ఎందుకంటే

తెలుగు సినిమాకు మాస్‌ఫార్ములా చూపించిన నటుడు ఎన్టీఆర్‌ అయితే ఆ అభిమానాన్ని ఆకాశం ఎత్తుకు తీసుకుపోయిన నటుడు బాలయ్య.జూన్ 10 అనగానే సినీ పరిశ్రమకు బాలయ్య బర్త్ డే ఠక్కున గుర్తుకు వస్తుంది.కాకపోతే ఈరోజును అంతగా గుర్తించుకునే మెమొరీస్ అంటూ అభిమానులకు గత కొన్ని ఏళ్లుగా లేవు. కానీ ఈ బర్త్ డే అందుకు భిన్నంగా ఉందని చెప్పాలి .ఎప్పుడూ లేనిది మూడు సర్ఫ్రైజ్ లు బాలయ్య బర్త్ డేకు ఈసారి చూస్తున్నాం.

నందమూరి వారి అబ్బాయిగా అభిమానులు తన మీద పెంచుకున్న నమ్మకానికి వంద శాతం న్యాయం చేశాడు బాలకృష్ణ. మారుతోన్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా బాలయ్య బాబు ఎప్పటికప్పుడు
సరికొత్త చిత్రాలతో… గతంలో తాను చేయని జోనర్లను టచ్ చేస్తూనే ఉన్నాడు.దానిలో భాగంగా రొటీన్ చిత్రాలకు కాస్త దూరం జరిగిన మాట వాస్తవం.అయినప్పటికీ తనదైన శైలిలో పాత్రలను పోషిస్తూ రాజసం ఒలకబోస్తున్నాడు.

ఈసారి బాలయ్య బర్త్ డే కు ఒక రోజు ముందుగానే బోయపాటి కలర్ ఫుల్ పోస్టర్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు.ఇది చాలదన్నట్లు నెట్టింట్లో బాలకృష్ణ హ్యాష్ ట్యాగ్ ను ఫ్యాన్స్ ట్రెండ్ చేశారు.ఇక ఈ టైమ్లో ఫ్యాన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో పాటు తన అన్న హరికృష్ణ కుమారుడు తారక్ నుంచి కూడా ట్వీట్ లభించింది.ఇప్పటికే తారక్ తో బాలయ్యకు అంత చనువు లేదని ఎప్సటినుంచో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కాని గత కొంతకాలంగా ఇద్దరు మధ్య టర్మ్స్ బాగున్నాయని దానిలో భాగంగానే ఈ పాజిటివ్ వైబ్ అంటూ కొందరంటున్నారు.

బాలయ్య బర్త్ డేకు వచ్చిన పాజిటివ్ వైబ్స్ లో మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ గురించి ప్రదానంగా చెప్పుకోవాలి.మలినేని గోపీచంద్ డైరెక్షన్లో తెరకెక్కించబోయే సినిమా తాలుకు పోస్టర్ నందమూరి అభిమానుల్లో మాంచి జోష్ ను తీసుకువచ్చింది.లయన్ పిక్చర్ ను పోస్టర్ గా రిలీజ్ చేయడం సినిమా ఎంతటి హెవీ యాక్షన్ తో ఉండబోతుందో గోపీచంద్ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లకముందే చెప్పాడు.ఇలా ఎలా చూసుకున్నా ఈ బర్త్ డే బాలయ్యకు ఎంతో ప్రత్యేకం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here