Home News

కాంగ్రెస్ పొత్తుతో ఉపఎన్నిక బరిలో టీడీపీ..బాబు వ్యూహం ఫలిస్తుందా ?

ఏపీలో మరో ఉపఎన్నికకు రంగం సిద్దం అవుతుండటంతో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంది టీడీపీ. బద్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో అక్కడ ఎన్నిక ఖచ్చితంగా నిర్వహించాల్సిందే. అయితే కోవిడ్ కారణంగా ఇప్పుడు ఉప ఎన్నిక వాయిదా పడినా ఎన్నిక జరగాల్సిందే. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించింది. మొదట పోటీ పై ఆసక్తి చూపని టీడీపీకూడా ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో కూటమి కట్టే ప్రయత్నం చేస్తుంది.

బద్వేలు ఉప ఎన్నికల్లో అభ్యర్దిని సర్వే ద్వారా ఎంపిక చేయాలని భావించిన చంద్రబాబు పొత్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి గ్రిప్ ఉంది. 1985, 1994, 1999లో ఇక్కడ విజయం సాధించింది. జగన్ సొంత జిల్లా కావడం వైసీపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ దూకుడు అడ్డుకునేందుకు పొత్తులపై వ్యూహాలు రచిస్తున్నారు చంద్రబాబు. కాంగ్రెస్ తో నేరుగా పొత్తు లేకపోయినా అవగాహన కుదుర్చుకోవాలంటున్నారు. కమ్యునిస్టు పార్టీలను నేరుగా కలుపుకుని వెళ్లాలన్న యోచనలో ఉన్నారు. దీని ద్వారా 2024 ఎన్నికల కూటమికి ఒక దారి ఏర్పడుతుందన్నది చంద్రబాబు భావన.

జనసేన మద్దతుతో ఇక్కడ బీజేపీ కూడా బరిలో దిగే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే జయరాములును బరిలోకి దింపే అవకాశాలున్నాయి. ఇక జనసేన కు పెద్దగా అక్కడ ఓటు బ్యాంకు లేదు. మరి చంద్రబాబు వ్యూహం ఉప ఎన్నికలో ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here