Home News Politics

బీజేపీలో చేరిన బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్! కారణాలు ఇవే

బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె కాషాయ తీర్ధం తీసుకున్నారు.

త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీయే ఎన్నికల్లో సైనా నెహ్వాల్ తో ప్రచారం చేయించడం కోసం బీజేపీ లో యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు బీజేపీ పెద్దలు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో ఆమె పార్టీలో చేరతారని అన్నారు. అయితే నడ్డా బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె అరుణ్ సింగ్ సమక్షంలో చేరారు.

సైనా నెహ్వాల్ ని కండువా కప్పి అరుణ్ సింగ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని అన్నారు. ఇక సైనా 2012 లండన్ ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచింది. మోడీ నేతృత్వంలో బీజేపీలో పనిచేయాలని భావిస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపింది సైనా నెహ్వాల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here