Home News Politics

చివ‌రికి మోత్కుప‌ల్లి కూడా..

తెలంగాణ‌లో టీడీపీ క‌థ క్లైమాక్స్‌లో

మీకు తెలుసా..తెలంగాణ‌లో క‌ర్ణాట‌క సీన్ రిపీట్ కాబోతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీనే కీల‌కం కాబోతోంది. ముచ్చ‌ట‌గా మూడోస్థానంలో ఉన్నా క‌న్నడ‌నాట జేడీఎస్ అధికారంలోకి రాలేదూ..అలాగ‌న్న‌మాట‌. ఏ స‌ర్వే నివేదిక‌నో కాదు. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబు న‌మ్మ‌కంగా చెబుతున్నారీ మాట‌. ఉనికికోస‌మ‌న్న‌ట్లు మిగిలి ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్వ‌హించిన మ‌హానాడులో చంద్ర‌బాబు భావోద్వేగంగా స్పందించినా త‌మకెంత సీనుందో తెలిసిన త‌మ్ముళ్లు పెద్ద‌గా రెస్పాండ్ కాలేదు. రాక‌రాక చాలాకాలానికి వ‌చ్చారు. కాసేపు మాట్లాడుకోనీ అంటూ నిరాస‌క్తంగా, నిర్వికారంగా చంద్ర‌బాబు ప్రసంగాన్ని విన్నారు. గ‌ట్టిగా చ‌ప్ప‌ట్లు..అని ప‌దేప‌దే అడుగుతుంటే త‌ప్ప‌ద‌న్న‌ట్లు రెండు చేతులు క‌లిపారు.

క‌ర్నాట‌క ఫ‌లితాల త‌ర్వాత కేంద్రం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతుంద‌ని మొన్న‌టిదాకా నిద్ర‌లో కూడా క‌ల‌వ‌రించిన చంద్ర‌బాబుకు నాట‌కీయ ప‌రిణామాల‌తో అక్క‌డ సీన్ మారిపోవ‌డం ప‌ర‌మానందాన్ని క‌లిగిస్తోంది. 224 సీట్లున్న క‌ర్ణాట‌కలో జ‌స్ట్ 37 సీట్లు గెలుచుకున్న జేడీఎస్ అధికారంలోకి రాగా లేంది…అలాంటి అద్భుత‌మేద‌న్నా జ‌రిగి తెలంగాణ‌లో కింగ్ మేక‌ర్లం కాక‌పోతామా అని ఏదోమూల చిన్న ఆశ‌. పైగా నేత‌ల వ‌ల‌స‌ల‌తో తెలంగాణ త‌మ్ముళ్లు డీలాప‌డిపోయి ఉన్నారు. ఓటుకునోటు త‌ర్వాత ఏపీకి ప‌లాయ‌నం చిత్త‌గించార‌న్న అప‌ప్ర‌ద ఇంకా పోలేదు. అందుకే మ‌హానాడుకొచ్చి స్పీచ్‌తో ఊద‌ర‌గొట్టేశారు. ప‌దోవంతు సీట్లు కూడా రాని పార్టీ క‌ర్ణాట‌క‌లో అధికారంలోకొస్తే…రేపు ప‌దిహేను ఇర‌వై సీట్లొస్తే తెలంగాణ‌లో చ‌క్రం తిప్ప‌గ‌ల‌మ‌ని దింపుడుక‌ళ్లెం ఆశ‌.

 

ఆశ‌ప‌డ‌టంలో త‌ప్పులేదుగానీ అత్యాశ‌యితేనే క‌ష్టం. తెలంగాణ‌లో అద్భుతాలు జ‌రుగుతాయ‌ని చంద్ర‌బాబు క‌ల‌లుగంటుంటే నేత‌లు ఒక‌ళ్ల‌వెంట ఒక‌ళ్లు సైకిల్ దిగుతున్నారేగానీ ఎవ‌రూ ఎక్క‌డం లేదు. టీఆర్ఎస్ లాగేసుకున్నాక మిగిలిన‌వాళ్ల‌తో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా క‌ప్పేసుకున్నారు. మిగిలిన మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేల్లో ఒక‌రు ట‌చ్‌మినాట్ అన్న‌ట్లుంటే…సండ్ర ఒక్క‌రే సింగిల్‌గా మిగిలారు. మొన్న‌టిదాకా గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విపై ఆశ‌ల‌ప‌ల్ల‌కీలో ఊరేగి…అది ప‌గ‌టిక‌లేన‌ని అర్ధ‌మ‌య్యాక పార్టీపై విర‌క్తిచెందిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మ‌హానాడు ద‌రిదాపుల్లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. మొన్నటిదాకా కేసీఆర్‌పై విరుచుకుప‌డిన మోత్కుప‌ల్లికి క‌నీసం ఆహ్వానం కూడాలేదు. మూడేళ్లుగా చంద్ర‌బాబుని క‌ల‌వాల‌నుకుంటుంటే ఆయ‌న ఐదు నిమిషాలు టైం ఇవ్వ‌లేక‌పోయార‌నేది మోత్కుప‌ల్లి ఆవేద‌న‌. చేతకానివాళ్లు, పనికిమాలిన వాళ్ల‌ని చుట్టూ చేర్చుకుని పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన మ‌మ్మ‌ల్ని పక్కన పెడుతున్నార‌ని న‌ర్సింహులు ఆక్రోశించారు.

టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాల‌ని డిమాండ్ చేసిన‌ప్ప‌ట్నించీ మోత్కుప‌ల్లిని ప‌క్క‌న‌పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. దాదాపు 35 ఏళ్లుగా పార్టీతో అనుబంధ‌మున్న ద‌ళిత‌నేత‌ను కాపాడుకోవాల్సిన పార్టీనే పొమ్మ‌న‌లేక పొగ‌బెడుతుంటే…క‌ర్నాట‌క మ్యాజిక్ తెలంగాణ‌లో ఎలా సాధ్య‌మ‌ని చంద్ర‌బాబు అనుకుంటున్నారో ఆయ‌న‌కే తెలియాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here