Home News Updates

కరెన్సీ నోట్లు పట్టుకుంటున్నారా .. తస్మాత్ జాగ్రత్త ..

కరెన్సీ నోట్లు … అనారోగ్య కారకాలా. అంటే నిజమే అనీ సమాధానం వస్తోంది … చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం వల్లే చాలా వ్యాధులు ప్రబలుతున్నాయని వైద్య నిపుణులు చెబుతూ వస్తున్నారు. కరెన్సీ నోట్లను చేతితో లెక్కించి ఇవ్వక తప్పని పరిస్థితి. మరి అలంటి పరిస్థితి వల్లే జబ్బులు వస్తున్నట్లు ఆధారాలు వున్నాయి.

2018లో చేపట్టిన ఒక అధ్యయనంలో రూ.100., 50., 20 ., 10 నోట్ల నుంచి ఈ కొలీ బ్యాక్టీరియా సాల్మొనెల్లా టైఫి మరో రెండు ఇతర వైరస్ లు వ్యాప్తి చెందినట్టు గుర్తించారు. కరెన్సీ నోట్లు., కాయిన్స్ ను పరిశీలించినపుడు వాటిపై బ్యాక్టీరియా., ఫంగస్., ఇతర పరాన్నజీవులు ఉన్నట్టు గుర్తించారు. అలాగే కరోనా కూడా కరెన్సీ నోట్ల ద్వారా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని
చెబుతున్నారు . చైనా లో ఇప్పటికే లిక్విడ్ కాష్ నిషేధించారు .. కరోనా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కరెన్సీ నోట్లపై ఆంక్షలు తప్పలేదు. కరెన్సీని తగ్గించి ఇ-కామర్స్ నెట్ బ్యాంకింగ్ లను వాడుకోవాలని అక్కడి ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఏదేమైనా ఇక నుండి డబ్బులు ఇతరుల నుండి తీసుకోవాల న్నా కూడా ఒకసారి ఆలోచించి తీసుకోవాలి .

ఇందులో భాగం గానే కరోనా ను అడ్డుకునేందుకు అరుణాచల్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలోకి విదేశీయుల రాకపోకలపై నిషేధం విధించింది. విదేశీయులకు అనుమతులు(పీఏపీ) ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. కరోనాకు పురుడు పోసుకున్న చైనాతో సరిహద్దును పంచుకునే అరుణాచల్ ప్రదేశ్లోకి పీఏపీలకు ప్రవేశం అనుమతించాలని విదేశీయులు కోరుతున్నా అంగీకరించడం లేదు. తాజాగా కేరళలో ఒకేరోజు ఐదు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమై విదేశీయులకు అనుమతి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here