Home News Updates

రాజుగారి దారెటు…?

ఏపీ రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ ఆయన జిల్లా టీడీపీ లో మకుటం లేని మహారాజుగా ఎదిగిన ఆ సీనియర్ నేతకు సొంత పార్టీ లోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా…? తన మాటే వేదంగా జిల్లా పార్టీని నడిపిన ఆ నేతకు వచ్చే ఎన్నికలు అగ్ని పరీక్షలా మారాయా? … ఆ అనుమానాలతోనే .. అధిష్టానం ఆదేశించినా ఎంపీ టికెట్‌ తీసుకోడానికి సదరు లీడర్‌ ససేమిరా అంటున్నారని జిల్లాలో వినిపిస్తున్న టాక్‌ .. అసలింతకీ రాజుగారి మనసులో ఏముంది? .

విజయనగరం జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేత అశోక్ గజపతిరాజు. .. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా సైతం గెలుపొంది రాష్ట్ర, కేంద్ర మంత్రిగా కూడా కీలక పదువుల్లో పని చేశారు . నిన్న మొన్నటి వరకు జిల్లా తెలుగుదేశంలో అశోక్ గజపతిరాజు ఏది చెపితే అదే శిలా శాసనం.. ఇప్పటివరకు జిల్లాలో అశోక్ ని దాటి మాట్లాడేవారే లేరంటే అతిశయోక్తికాదు .. అలా జిల్లా టీడీపీని శాసించిన అశోక్ గజపతిరాజు .. ఇప్పుడు పట్టువిడుపు ధోరణిలోకి వచ్చినట్లు కనిపిస్తున్నారు … పార్టీలో పరిస్థితులు రోజురోజుకు మారుతుండటంతో అశోక్ రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనలో పడినట్లు కనిపిస్తున్నారు

టీడీపీలో అశోక్ స్థానం ఏంటి అంటే ఏవరైనా చెప్పిది నెంబర్ 2 అనే.. ఆయనంటే అధినేత కి సైతం అంత గౌరవం .. ఏళ్ల తరబడి జిల్లాలో టీడీపీని ఓంటి చేత్తో నడిపిన ఘనత ఆయన సొంతం… 2014 ఎన్నికల వరకు ఆయన ఎవరి పేరు చేబితే వారికే అధినేత టికెట్ ఖరారు చేసేవారు … ఆయన స్మూత్‌గా వ్యవహారాలు డీల్‌ చేస్తూ పార్టీని నడిపిస్తుండటంతో జిల్లా రాజకీయాల్లో చంద్రబాబు కూడా సాధారణంగా జోక్యం చేసుకునే వారు కాదంటారు .. అయితే ప్రస్తుతం అశోక్ కి సైతం టెన్షన్ పుట్టిస్తున్నాయట జిల్లా టిడిపి రాజకీయాలు … జిల్లాలో టిడిపి ఎమ్మెల్యేలు, నేతలు మూడు వర్గాలు గా విడిపోయారు .. కేంద్రమంత్రిగా కొంతకాలం జిల్లా రాజకీయాలకు దూరంగా ఉండటంతో .. పార్టీ శ్రేణులు ఎవరికవారే యమునా తీరే అన్నట్లు వ్యవహిరించి గ్రూపులు కట్టడం వ్యవహిస్తుండటం అశోక్‌గజపతిరాజుకి మింగుడు పడటంలేదని సమాచారం … ఆ క్రమంలో తాను మరోసారి విజయనగరం ఎంపిగా పోటీ చేసి .. తన కుమార్తెని విజయనగరం అసెంబ్లీలో దించాలని అశోక్ భావించారట ఆయన ..

అయితే నియోజకవర్గం లో ఎమ్మెల్యే సీటుకు పోటి పెరగడం తో అశోక్‌ పునరాలోచనలో ఆలోచనలో పడినట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు … దానికి తగ్గట్లే నియోజకవర్గంలో బిసిలు అధికంగా ఉండటంతో బిసి నేతలు తమకే సీటు కేటాయించాలని పట్టుబడుతున్నారు .. అలాగే మరోసారి అవకాశం ఇవ్వాలని సిట్టింగ్‌ ఎమ్మెల్యే మీసాల గీత అధిష్టానాన్ని కోరిఉన్నారు … తాజాగా మున్సిపల్ చైర్మన్ ప్రసాదు సైతం సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు …

మరో వైపు కిషోర్ చంద్రదేవ్ టిడిపి నుంచి అరకు ఎంపిగా పోటీచేయనుండటం కూడా అశోక్ పునరాలోచనకు మరో కారణమంటున్నారు … కిషోర్‌చంద్రదేవ్‌ ఎంట్రీతో విజయనగరం ఎంపిగా తాను గెలిచినా పెద్దగా ఉపయోగం ఉండదని లెక్కలు వేసుకుంటున్నారట.. అరకు నుండి కిషోర్ చంద్రదేవ్ విజయం సాధించి .. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కిషోర్ చంద్రదేవ్ కి మంత్రి పదవి వస్తుందని … దాంతో జిల్లా పై తన పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తున్నట్టు సమాచారం …

అందుకే జిల్లా పార్టీపై తన పట్టు నిలబెట్టుకోవడానికి ఈ సారి ఖచ్చితంగా అసెంబ్లీ బరిలో దిగడానికి డిసైడ్‌ అయ్యారంట… ఎమ్మెల్యేగా అయితే ఖచ్చితంగా గెలవడంతో పాటు టిడిపి అధికారంలోకి వస్తే కీలక శాఖ సైతం తన గుప్పేట్లోకి వస్తుందని .. అప్పుడు తన రాజసాన్ని నిలబెట్టుకోవచ్చన్నది అశోక్ అలోచనగా తెలుస్తోంది … తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఒక వేళ అధినేత కాదు కూడదు అంటే తన కుమార్తెను విజయనగరం నుంచి పోటీ చేయించి .. తాను పోటీకి దూరంగా ఉంటే ఎలా ఉంటుందా? అని కూడా ఆలోచిస్తున్నారంట .. మరి చూడాలి గజపతిరాజావారి పొలిటికల్‌ ఫ్యూచర్‌ ఏంటో ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here