ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు సీఎం జగన్. కానీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సీఎం జగన్ మాత్రమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నారు. ఇక అన్నీంటికంటే ముఖ్యంగా జగన్ తీసుకోచ్చిన విలేజ్ వాలంటీర్ వ్యవస్థ అన్ని పథకాలను జనం చెంతకు చేరుస్తుంది. ఇక్కడే అధికారపార్టీ నేతల్లో అసంతృప్తి మొదలైంది.

నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా సాధారణంగా ఎమ్మెల్యే,ఎంపీ దగ్గరకి లేక అధికార పార్టీ నాయకుల వద్దకు ప్రజలు వెళ్లేవారు. ఇప్పుడు వారికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఏ పథకం వచ్చినా కూడా అది జగన్ ఇచ్చిందే అని ప్రజలు భావిస్తున్నారు. దీని వల్ల స్థానిక నేతలు మొదలు ఎమ్మెల్యేల వరకు ఎవరికి ఆ ఇమేజ్ దక్కడం లేదు. దీని పై ప్రభుత్వ కార్యక్రమాల్లో కొందరు మంత్రులు పబ్లిక్ గానే బరస్ట్ అయ్యారు.
వలంటీర్లు ప్రజలకు – సచివాలయాల మధ్య వారథిలాగా పనిచేస్తున్నారు. ఇలా జరగడం వల్ల ప్రజలకు ఎమ్మెల్యేలు ఎంపీలతో పెద్ద పని లేకుండా పోతుంది. ఇక ఇలాగే జరిగితే తమకు సొంతంగా ఇమేజ్ పెరగడం కష్టమని భావిస్తున్నారట. ఎందుకంటే చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఎంత కష్టపడుతున్నా వారికి రావాల్సిన మైలేజ్ రావడం లేదన్నది వారి భాదగా తెలుస్తుంది. దీనికి తోడు కరోనా కూడా తోడవ్వడంతో ఎమ్మెల్యేలు,ఎంపీలకు నిధులు లేక చేసేదేం లేకుండా పోయింది.