Home News

ఆ పోస్టులన్ని వైసీపీ కేడర్ కే నా …?

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువచేసే చక్కటి అవకాశం … గ్రామంలోనే ఉంటూ ఐదువేలు జీతం పొందే వెసులుబాటు … అందుకే నోటిఫికేషన్ విడుదల కాగానే కుప్పలతెప్పలుగా వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులు వచ్చిపడ్డాయి … ఇంతవరకూ బానే ఉన్నా … అసలు కథ ఇక్కడే మొదలైందట .. అప్లై చేసిన వారు మౌఖిక పరీక్షలకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపించడం లేదట … అదేమంటే నామ్‌ కే వాస్తేగా జరిగే సాగే ఇంటర్యూలకు వెళ్లి ఏం లాభం అంటున్నారంట… అసలీ పరిస్థితికి కారణమేంటి?

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు గ్రామాల్లోనే ఉంటూ ఉపాధి పొందడానికి ప్రభుత్వం ప్రకటించిన పథకమే గ్రామవాలంటీర్లు … తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామంలో ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించి ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటికే చేరేలా చేస్తానని వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో హామీ ఇచ్చారు … ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో గ్రామవాలంటీర్ల నియామకాలకోసం నోటిఫికేషన్ విడుదల చేశారు … శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణ , పట్ణణ , మున్సిపాల్టీలతో కలిపి మొత్తంగా 13, 628 మంది గ్రామ వాలంటీర్ల నియమకాలు జరగనున్నాయి … ఐతే పట్టణ , గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్మీడియేట్ … గిరిజన ప్రాంతాల్లో పదో తరగతి అర్హతగా నిర్ణయించడంతో చాలా మందికి ధరఖాస్తు చేసుకోవడానికి అర్హత లభించింది … గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ఈనెల పదో తేదీ వరకూ దరఖాస్తు చేసుకున్నారు .

పట్టణ ప్రాంతాల్లో మొదట డిగ్రీ అర్హ తగా నిర్ణయించినా.. తర్వాత ఇంటర్మీడియేట్ కు కుదించారు.. ఈనెల 15వ తేదీ వరకూ దరఖాస్తు గడువు పెంచి స్వీకరించారు … ఫలితంగా జిల్లాలో 13,628 వాలంటీర్ పోస్టులకు యువతనుంచి భారీగానే స్పందన వచ్చింది . దరఖాస్తులన్నింటినీ పరిశీలించన తర్వాత జిల్లాలో 77,076 మంది మౌఖిక పరీక్షకు అర్హత సాధించినట్లు అధికారులు ప్రకటించారు …

గ్రామ పంచాయతీల్లో గ్రామ వాలంటీర్లు … నగరపంచాయతీ , పురపాలక సంఘాలు , నగరపాకల సంస్థల్లో వార్డు వాలంటీర్ ఎంపికకు … ప్రధానంగా మూడేసి ఇంటర్యూ బోర్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది … మండలాల్లో ఒక బోర్డుకు ఎంపీడీఓ ఛైర్మన్ గా , మరో బోర్డుకు వ్యవసాయశాఖ అధికారి , ఇంకో బోర్డుకు మండలంలో పరిస్థితులకు అనుగుణంగా మండల విద్యాశాఖ అధికారి , మండల ఇంజనీరింగ్ అధికారులను నియమించి బాధ్యతలు అప్పగించారు..

బదిలీల సమయం కావడంతో ఇబ్బందులు ఎదురైన చోట ఎంపీడీఓ ఛైర్మన్ గా …తహసీల్దారు , ఈవోఆర్డీవోలను సభ్యులుగా నియమించారు.. . చాలాచోట్ల తహసీల్దార్లు హాజరుకాని పరిస్థితి నెలకొంది … తమ స్థానే సీనియర్ అసిస్టెంట్లు , డిఫ్యూటీ తహసీల్దార్లను పంపిస్తున్నారు … ఒక్కో బోర్డు రోజుకు కనీసం 60 మందిని ఇంటర్యూ చేసేలా ప్రణాళిక రూపొందించారు … ఈమేరకు జిల్లాలో ఈనెల 11వ తేదీ నుంచి అర్హత సాధించిన అభ్యర్ధులందరికీ మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నారు …
గ్రామవాలంటీర్ పోస్టులకు టెన్త్ , ఇంటర్ , డిగ్రీ అర్హత ఉన్నవారే కాకుండా .. డైట్ , బీటెక్ ఇలా ఉన్నత విద్యను అభ్యసించిన వారు సైతం దరఖాస్తు చేసుకుని .. మౌఖిక పరీక్షల్లో అర్హత సాధించి తమ లక్ ను పరీక్షించేందుకు క్యూ కడుతున్నారు … అంతవరకూ బానే ఉన్నా … గ్రామవాలంటీర్ పోస్టులకు దరఖాస్తుల సమయంలో వచ్చినంత భారీ స్పందన ఇంటర్యూలకు హాజరయ్యే విషయంలో మాత్రం కనిపించడం లేదు …ఈ మౌఖిక ఇంటర్యూలకు హాజరయ్యేందుకు వేలాది మంది ఆసక్తి చూపకపోవడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది..

కేవలం తూతూమంత్రంగా మాత్రమే జరిగే ఈ ఇంటర్యూలకు మనమెందుకు హాజరుకావడమనే భావనలో అభ్యర్ధులు ఉండటమే అందుకు కారణమట … గ్రామ వాలంటీర్ల ఇంటర్యూలో అధికారులు ప్రతిభను పక్కన బెట్టి మండల నియోజకవర్గ స్థాయి వైసీపీ శ్రేణుల సిఫార్సులకు పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు జిల్లావ్యాప్తంగా వినిపిస్తున్నాయి … గ్రామ , వార్డుల స్థాయిలో వాలంటీర్ల నియామక ఇంటర్యూల్లో నియోజకవర్గ , మండల స్థాయి వైసీపీ నేతలు చక్రం తిప్పుతున్నారట …

ఇంటర్యూలకు హాజరయిన అభ్యర్ధుల జాబితాలను , వారి మార్కుల వివరాలను సంబంధిత అధికారుల నుంచి ప్రతీ రోజూ తమ కార్యాలయాలకు తెప్పించుకుని డమ్మీ జాబితాలను తయారు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది … దీంతో కష్టపడి ఇంటర్యూలకు హాజరై … ఈ పోస్టులను ఆశించే ప్రతిభావంతులైన నిరుద్యోగులు నిరాశ , నిస్పృహతో ఈ రిక్రూట్ మెంట్ పై నమ్మకం కోల్పోతున్నారు …

మరోవైపు నియామకాలకు ఎటువంటి రాతపరీక్షలు లేకుండా .. కేవలం మౌఖిక పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి .. ఆ ఇంటర్వ్యూలు కూడా సరైన వారి పర్యవేక్షణలో జరగడం లేదు.. పంచాయతీ కార్యదర్శులు , వీఆర్వో క్యాడర్ గల వ్యక్తులు ఈ ఇంటర్యూలను తూతూ మంత్రంగా నిర్వహిస్తూ మమ అనిపించేస్తున్నారనే విమర్శలు విపిస్తున్నాయి … ఒక పక్క ఇంటర్యూలు జరుగుతుండగానే.. మరోవైపు గ్రామ వార్డుల్లో వైసీపీ శ్రేణులు ఈ పోస్టులను పంచుకొంటూ వారి స్థాయిలో అర్హుల జాబితాలను తయారు చేసుకుంటున్నట్లు సమచారం … ఈ విమర్శల ప్రభావమో? ధరఖాస్తుదారుల్లో అపోహలు తొలగించడానికో కాని .. మౌఖిక పరీక్షలకు హాజరుకాని వారికి మరో అవకాశం కల్పిస్తూ అధికారులు ఈనెల 24, 25 తేదీల్లో మరోసారి ఇంటర్యూలు నిర్వహించనున్నారు … చూడాలి నియామకాలు ఎంత పారదర్శకంగా జరుగుతాయో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here