Home News Politics

ఆపరేషన్ గరుడా…టీవీ9 యూ ట‌ర్న్ తీసుకుందా… ? ఏబీఎన్,టీవీ 5 తగ్గట్లేదుగా…!

జగన్ హత్యయత్నం కేసు కేంద్రానికి చేరింది. ఇప్పటి వరకు ఏమి పట్టనట్లు ఉన్న కేంద్రం ఈ కంప్లైంట్ తో సీరియస్ నెస్ పెంచింది. అసలు ఏపీలో ఏం జరుగుతుంది…. అక్కడి నాయకులు ఎవరి పాలిటిక్స్ వారు చేస్తు తప్పు మాత్రం చాకచక్యంగా కేంద్రం పై నెట్టడం…ఒక నటుడు చెప్పిన స్క్రిప్ట్ ఆపరేషన్ గరుడా కి మూలం కమళదళమే అని లేని బురద చల్లడంతో దీని వెనకున్న వ్యవహారాలపై సీరియస్ గా దృష్టిసారించింది కేంద్రప్రభుత్వం….

కేవలం ఒక సెక్షన్ చానల్స్ లోనే ఈ ఆపరేషన్ గరుడా పై ఎక్కువ ప్రమోట్ చేస్తూ పుంకాను పుంకాలుగా స్టోరీలు ఇచ్చేస్తున్నాయి. అసలు దీని వెనక ఎవరున్నారు పేరుకి శివాజీ ఒకే కాని శివాజీని ఆడిస్తుంది ఎవరన్న దాని పై దృష్టి పెట్టింది కేంద్రం. ఒక ప్లాన్ ప్రకారం ఏపీలో కమలం పార్టీని పలచన చేస్తున్న కీ లీడర్స్ ఎవరన్నది వెతికే పనిలో ఉంది. దినితో పాటు కొన్ని చానల్స్ దీనికి ఎందుకు అతిగా ప్రాధాన్యత ఇస్తున్నాయి గంటలకు,గంటలు ఎందుకు చర్చలు నడుపుతున్నాయి. అసలేంటీ ఈ ఆపరేషన్ గరుడా వ్యవహారం. దిన్ని ప్రభుత్వానికి రిలేటెడ్ గా ఉండే చానల్సే పెంచి పోషిస్తున్నాయా అన్న దిశలో ఆలోచిస్తుంది కేంద్రం.

తాజాగా ఒక చానెల్ తీరు గ‌మ‌నిస్తే మాత్రం కొంత మార్పు కనబడుతుంది. ఆరంభం నుంచి అధికార‌పార్టీకి వంత‌పాడ‌డంలో ఈ చానెల్ ది అందెవేసిన చేయిగా చెబుతుంటారు. అందుకు త‌గ్గ‌ట్టుగా కొత్త కొత్త ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంభించడంలో ఆరితేరిన‌ట్టుగా చెబుతారు. అయితే ఇటీవ‌ల యాజ‌మాన్యం మారిన త‌ర్వాత ధోర‌ణి దాదాపుగా మారిపోయింద‌నే రీతిలో ప్ర‌స్తుతం టీవీ9 ప్ర‌సారాలు క‌నిపిస్తున్నాయి. ఇది ఎన్నాళ్లుంటుంద‌న్న‌ది ప‌క్క‌న పెడితే తాజాగా జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి త‌ర్వాత ప‌రిణామాలు గ‌మ‌నిస్తే టీవీ9 దాదాపుగా యూ ట‌ర్న్ తీసుకున్న‌ట్టు అనేక మంది భావిస్తున్నారు. ఏపీలో అధికార పార్టీ వాద‌న క‌న్నా విప‌క్షానికే ప్రాధాన్య‌త‌నిచ్చేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నం దానికి తార్కాణంగా చెబుతున్నారు.

ఇటీవ‌ల టీవీ9 గ్రూపుని మై హోమ్స్ రామేశ్వ‌ర రావు, మేఘా కృష్ణారెడ్డి కాంబినేష‌న్ టేకోవ‌ర్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇరువురికి తెలంగాణా ఎన్నికల్లో కేసీఆర్ కి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం అత్య‌వ‌స‌రం. అందుకు త‌గ్గ‌ట్టుగానే జ‌గ‌న్ పై దాడి జ‌ర‌గ‌గానే కేసీఆర్ క్యాంప్ స్పందించిన‌ట్టుగానే టీవీ9 స్వ‌రం వినిపించింది. జ‌గ‌న్ కి కాస్త సానుకూలంగా ప్ర‌సారాలు సాగిస్తోంది. చివ‌ర‌కు వైవీ సుబ్బారెడ్డి వంటి వారి ప్రెస్ మీట్ లు కూడా బ్రేక్స్ లేకుండా ఆద్యంతం చూపించి ఆశ్చర్య‌ప‌రుస్తోంది. ఇక ఏబీఎన్,టీవీ 5,మహా టీవీలు మాత్రం టీడీపీ వాయిస్ మాత్రమే వినిపిస్తూ చంద్రబాబు వాయిస్ వినిపిస్తున్నాయి.

ఇదంతా రాజ‌కీయ ల‌క్ష్యాల సాధ‌న‌కు త‌గ్గ‌ట్టుగానే క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ మార్పు మాత్రం అనూహ్యంగానే చెప్పాలి.అంతేగాకుండా ఒక్క సాక్షి మిన‌హా మిగిలిన వారంతా జ‌గ‌న్ పై జ‌రిగిన దానిని దాడిగా చెబుతుంటే, టీవీ9 మాత్రం ఓ అడుగు ముందుకేసి హ‌త్యాయ‌త్నం గా చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. త‌ద్వారా వైసీపీ నేత‌ల వాద‌న‌కు బ‌లం చేకూర్చింద‌న్న‌ది స్ప‌ష్టంగా చెప్ప‌వ‌చ్చు. సీఎం చంద్ర‌బాబు చిన్న దాడి అని, లోకేష్ అయితే జ‌గ‌న్నాట‌కం అని చెబుతున్న వేళ టీవీ9 ఇలాంటి లైన్ తీసుకోవ‌డం ఆశ్చర్యంగానే క‌నిపిస్తోంది.

అంతేగాకుండా టీడీపీ కి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే చ‌ర్చ‌ల్లో కూడా ర‌జ‌నీకాంత్ వంటి వారి దూకుడు దాదాపుగా త‌గ్గిపోయిన‌ట్టుగా అంచ‌నాలేస్తున్నారు. న్యూట్ర‌ల్ గా ఉన్న‌ట్టు క‌నిపించే ప్ర‌య‌త్నం మ‌రింత తీవ్ర‌మ‌యిన‌ట్టుగా భావిస్తున్నారు. ఆపరేషన్ గరుడాని కూడా టీవీ 9 తుంగలో తొక్కింది. TV5 మాత్రం మూర్తితో స్పెషల్ డిస్కషన్స్ పెడుతూ వైసీపీ పై ఎదురుదాడి చేస్తుంది. వైసీపీ విషయంలో ఏబీఎన్ లైన్ గురించి వేరే ఇక చెప్పాల్సిన పనిలేదు. సొంత సాక్షికి తోడుగా ఎన్టీవీ కూడా కొంత బ్యాలెన్స్ గా వెళుతున్న త‌రుణంలో టీవీ9 తోడ్పాటు వైసీపీ క్యాంప్ లో కొంత హ్యాపీనెస్ క్రియోట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here