Home News Updates

సుప్రీంలో ఏపీ ‘పంచాయతీ’ తీర్పు..?

ఆంధ్రరాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణ రాష్ట్రంలో ఆసక్తిగా మారింది. ఎన్నికల కమీషన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎస్ఈసీ షెడ్యూల్‎ను సమర్ధస్తూ పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని, ప్రభుత్వం ఎస్ఈసీకి సహకరించాలని ఏపీహైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇట్టి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో ఫీటీషన్ దాఖలు చేయగా సోమవారం సుప్రీంకోర్టు ఫిటీషన్‎ని విచారించనుంది. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్, జస్టిస్‌ హృషీకేష్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈపిటిషన్‌ విచారించనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా విచారించనకు రానుందని సమాచారం.

హైకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. దీంతో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు కరోనా నేపథ్యంలో విధులకు హజరుకాబోమని ప్రకటించారు. ఇదిలా ఉండగా కేంద్రబలగాలను తీసుకువచ్చయినా ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ తెలిపారు.

మొత్తానికి ఏపీ ప్రభుత్వం- రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ నేటి సుప్రీం తీర్పుతో తీరనుందా అనేది విశ్లేషకులు ఆలోచన చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని సమర్దిస్తూ సుప్రీం తీర్పునిస్తే తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటీ చర్యలు తీసుకోనుంది అనే ప్రశ్న తలెత్తుది. ఏదిఏమైనప్పటికి సుప్రీం తీర్పుకోసం మరికొద్ది క్షణాలు వేచిచూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here