
సుప్రీం తీర్పు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘానికి అనుకూలంగా రాగా ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ స్థానిక సంస్థల ఎన్నికల షేడ్యూల్ మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడత ఎన్నికలు నాలుగో విడతలో జరుగతాయని, రెండో దశ ఎన్నికలు తొలి దశగా మారుస్తూ రీషెడ్యూల్ చేసింది ఎన్నికల సంఘం. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా మార్పుచేయగా..నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్ఈసీ మార్పు చేసింది. వచ్చేనెల ఫిబ్రవరి 9, 13, 17, 21వ తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

ఇందులో భాగంగా తొలిదశ ఎన్నికలకు ఈనెల 29నుంచి నామినేషన్లు స్వీకరించగా..రెండో దశకు ఫిబ్రవరి 2నుంచి, మూడో దశకు ఫిబ్రవరి 6నుంచి, నాలుగో దశకు ఫిబ్రవరి 10నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.