Home News Politics

గెలిచేదెవ‌రు? ఓడెదెవ‌రు?

ఎవ‌రిది మేక‌పోతు గాంభీర్యం?

ఎల‌క్ష‌న్ కాగానే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ రిలాక్స్ అయిపోయారు. ఆయ‌న లోట‌స్‌పాండ్‌లో పార్టీ నేత‌ల‌కు కూడా పెద్ద‌గా క‌లిసే అవ‌కాశం ఇవ్వ‌డంలేదంటున్నారు. వీలైతే రిజ‌ల్ట్ వ‌చ్చేలోపే ఫ్యామిలీతో స‌ర‌దాగా ఫారిన్ ట్రిప్ వేసొచ్చే ఆలోచ‌న‌లో ఉన్నారు జ‌గ‌న్‌. దీంతో ఎల‌క్ష‌న్ అయిపోగానే జ‌గ‌న్ లోట‌స్‌పాండ్‌లో కూర్చున్నాడ‌ని టీడీపీ నేత‌లు దెప్పిపొడుస్తున్నారు. త‌మ నాయ‌కుడు జ‌నంలోనే ఉన్నార‌నీ, ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడేందుకు ఢిల్లీకెళ్లి మోడీమీద పోరాడుతున్నార‌ని ప‌చ్చ‌చొక్కా నేత‌లు ఆయ‌న్ని ఓ రేంజ్‌లో ఎత్తేస్తున్నారు.
ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబు దృష్టిలో నాయ‌కుడనేవాడు ఎప్పుడూ జ‌నంలోనే ఉండాలి. క్ష‌ణం తీరిక‌లేకుండా రాజ‌కీయం చేస్తూనే ఉండాలి. అందుకే ఆయ‌న ఈసీమీద పోరాటమ‌నే ముగింపు దొర‌క‌ని ఇష్యూని ఎత్తుకున్నారు. పిలిస్తే చాలు మిగిలిన రాష్ట్రాల్లోనూ ప్ర‌చారానికి సిద్ధ‌మ‌వుతున్నారు. దేవెగౌడ మ‌న‌వ‌డి కోసం మాండ్య‌లో ప్ర‌చారం చేసొచ్చారు. ఫ‌లితాలు రావ‌డానికి నెల‌పైనే స‌మ‌య‌ముంది. ఇంటిప‌ట్టున రెస్ట్ తీసుకుందామ‌న్నా ఈవీఎంలు పీడ‌క‌ల‌ల్లా చుట్టుముట్టేలా ఉన్నాయి. అందుకే త‌న “ధ‌ర్మ‌”(?)పోరాటాన్ని ప‌ట్టువ‌ద‌ల‌కుండా కొన‌సాగిస్తున్నారు టీడీపీ అధినేత‌.
జ‌గ‌న్ రిలాక్స్‌కి టీడీపీ ఎన్ని నిర్వ‌చ‌నాలు చెప్పినా…ఏడాదికాలంగా జ‌నంలోనే ఉన్న జ‌గ‌న్‌కి విశ్రాంతి అవ‌స‌ర‌మ‌నేది ఎవ‌రూ కాద‌న‌లేని విష‌యం. సుదీర్ఘ‌పాద‌యాత్ర ముగిసిందో లేదో ఎన్నిక‌లొచ్చి ప‌డ్డాయి. మ‌ల‌మ‌ల‌మాడ్చే ఎండ‌ల్లో అలుపెర‌గకుండా సాగింది జ‌గ‌న్ ప్ర‌చారం. ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని అభ్య‌ర్థిస్తూ జ‌నంలోకెళ్లిన జ‌గ‌న్‌కి జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. గెలుపుపై ఎవ‌రి అంచ‌నాలు వారివి. ప్ర‌జ‌లు ఎవ‌రికి ప‌ట్టంక‌ట్టార‌న్న‌ది మే 23న కానీ తెలీదు. గెలిచేది త‌మ నాయ‌కుడేన‌ని, అందుకే ఆయ‌న అంత నిశ్చింత‌గా ఉన్నాడ‌ని అంటున్నారు వైసీపీ నేత‌లు.
చంద్ర‌బాబునుంచి మొద‌లుకుని టీడీపీ ముఖ్య‌నేత‌ల‌దాకా త‌మ‌కు నూట‌పాతిక సీట్ల‌కు త‌గ్గ‌వంటున్నారు.త‌న పిలుపుతో జ‌నం ఓటింగ్‌కు క్యూ క‌ట్టారంటున్నారు చంద్ర‌బాబు. అంత కాన్ఫిడెన్స్‌గా ఉన్న‌ప్పుడు ఈవీఎంల ట్యాంప‌రింగ్ గురించి ఆందోళ‌నెందుకన్న‌ది విప‌క్ష‌నేత‌ల ప్ర‌శ్న‌. 50శాతం వీవీప్యాట్‌లు లెక్క‌పెట్టాల‌న్న‌ది చంద్ర‌బాబు డిమాండ్‌. అది జ‌రిగే ప‌ని కాద‌ని తెలిసినా…ఈ డిమాండ్‌తోనే జాతీయ‌నేత‌లంద‌రినీ ఏకం చేసే ప‌న్లో ఉన్నారాయ‌న‌. ఓట‌మికి చంద్ర‌బాబు ముందే కార‌ణాలు వెతుక్కుంటున్నారంటున్నాయి వైసీపీ, బీజేపీ. ఎవ‌రి కాన్ఫిడెన్స్ ఎలా ఉన్నా…ఓట‌ర్లు నేత‌ల త‌ల‌రాత‌లైతే రాసేశారు. ఏం రాశారో, ఎవ‌రిని గ‌ద్దెనెక్కిస్తారో ఈవీఎంలు బ‌య‌టికి తీస్తేగానీ బ‌య‌ట‌ప‌డ‌దు. అప్ప‌టిదాకా ఎవ‌రిది ఫ‌న్నో..ఎవ‌రిది ఫ్ర‌స్టేష‌నో చెప్ప‌డం క‌ష్ట‌మే!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here