Home News

బ్రేకింగ్: ఏపీ సర్కార్ కి భారీ షాకిచ్చిన హైకోర్టు..ఎన్నికలు రద్దు

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. స్థానిక ఎన్నికలో ప్రక్రియలో భాగాంగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఇప్పటివరకు ఫలితాలు ప్రకటించకుండా హోల్డ్ లో పెట్టిన హైకోర్టు తాజాగా ఎన్నికలు రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ లేదని హైకోర్టు పేర్కొంది. కేవలం వారంలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారని పోలింగ్ కి 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న నిబంధన పాటించలేదని తెలిపింది హైకోర్టు.

హడావిడిగా పోలింగ్ నోటిఫికేషన్ ఇచ్చారని 4 వారాల గడువు ఇవ్వలేదని గతంలో టీడీపీ నేత వర్ల రామయ్య వేసిన పీటిషన్ పై హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. దీనిపై తొలుత విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి రెండు రోజుల ముందు ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీని పై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయడంతో పోలింగ్‌కు అనుమతించిన డివిజన్ బెంచ్.. ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని ఆదేశించింది. తాజాగా ఎన్నికల ఫలితాల నిలుపుదల సవాలు చేస్తు సర్కార్ హైకోర్టుని ఆశ్రయించడంతో మొత్తం ఎన్నికల ప్రక్రియ రద్దు చేస్తూ హైకోర్టు సంచల ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించామని.. కౌంటింగ్‌కు అనుమతించాలని.. ఏపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here