Home Health corona

ఏపీ టెన్త్,ఇంటర్ పరీక్షల పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీ ఇంటర్‌, టెన్త్‌ పరీక్షల నిర్వహణ పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. కోవిడ్ కేసుల పెరిగిన నేపథ్యంలో పరీక్షల పై సర్కార్ పునరాలోచించాలని సూచించింది ఏపీ హైకోర్టు. టెన్త్,ఇంటర్ పరీక్షల్లో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు పరీక్షల్లో భాగం కావాల్సి ఉందని పేర్కొంది. పరీక్షలు వాయిదా వేయాలని ఏపీలో విపక్షాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.కేసు విచారణను హైకోర్టు మే 3వ తేదీకి వాయిదా వేసింది.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేస్తే ఏపీలో ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. పిటిషనర్ల తరపున సీనియర్‌ కౌన్సిల్‌ చేసిన వాదనలో.. చాలా అంశాలు ముడిపడి ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ప్రభుత్వం వెంటనే పున:పరిశీలన చేసుకోవాలని సూచించింది. మే 2లోపు ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here