Home Health corona

ప్రైవేట్ ఆస్పత్రుల బిల్లుల పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కరోనా పేరుతో రోగుల బలహీనతను ఆధారం చేసుకుని కరోనా పేషెంట్లనుంచి ప్రైవేటు ఆసుపత్రులు బిల్లులు భారీగా వసూలు చేస్తున్నాయి. లక్షల్లో బిల్లులు వేస్తు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల కాసుల కక్కుర్తి కి చెక్ పెడుతూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక పై బిల్లులను నోడల్ ఆఫీసర్ సమక్షంలోనే చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ఫీజులు ఉండాలని తేల్చి చెప్పింది.

ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బిల్లులు ఇచ్చారా లేదా అని నోడల్ ఆఫీసర్ మానిటర్ చేయాలని సూచించింది. నోడల్ అధికారి సంతకం లేకుండా కోవిడ్ ఆసుపత్రులు నగదు తీసుకోకూడదని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రతి కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స న‌గ‌దుకు సంబంధించి డిస్ ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేయాలని.. హైకోర్టు ఆదేశాలు అమలు జరిగిలా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఎంహెచ్ఓలను హైకోర్టు ఆదేశించింది. క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను అనుకూలంగా మార్చుకుని ప్ర‌వేట్ ఆస్ప‌త్రులు విచ్చ‌లవిడిగా దోపిడీకి తెగబ‌డుతుండటంతో హైకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ఆస్పత్రులలో ఫీజులకోసం మృతదేహాన్ని కూడా ఇవ్వని ఘటనలు చాలా జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి హైకోర్టు చెక్ పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here