జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలన్నీ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్తున్నాయా .. అంటే అవును అనే మాట వినిపిస్తుంది. మూడు రాజధానుల అంశం అలాగే ఉండి పోయింది .. అలాగే శాసన మండలి రద్దు నిర్ణయం కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంది. కారణాలు ఏమైనా కావచ్చు .. ఇవన్నీ ఎప్పుడైనా జరగవచ్చు .. కానీ అసెంబ్లీ లో అంత మెజారిటీ వున్న వైసీపీ నిర్ణయాలు అలా ఉండిపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తాయి. దీనికి తోడు ఇప్పుడు స్థానిక ఎన్నికలు సైతం వాయిదా పడడం కూడా వైసీపీ కి ఒకింత సెట్ బ్యాక్ అని చెప్పాలి
రాజధానుల నిర్ణయం పై కేంద్రం ఆలోచన ..
అటు ప్రధాని కూడా మూడు రాజధానుల అంశంపై తమకూ సమాచారం ఉందని ఆ విషయాన్ని పరిశీలిస్తున్నామని మోడీ రిప్లై ఇచ్చారు. మూడు రాజధానుల అంశం కేంద్రం దృష్టిలో ఉందని ఈ ప్రత్యుత్తరం తో తేలిపోయింది. స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం పై సెంటర్ రియాక్షన్ పాజిటివ్ గా ఉంటుందా నెగెటివ్ గా ఉంటుందా అన్నది తేలాలి.మోడీ రిప్లైతో రాజకీయ వర్గాలు మళ్లీ అలెర్టయ్యాయి. కేంద్ర నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.