Home News

రోజాకి సరిజోడిని సిద్దం చేసిన కమలదళం…!

అక్కడ బలపడటానికి కాషాయసేన పెద్ద కసరత్తే చేస్తోంది.. ఎప్పుడో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది … సామాజిక వర్గాల వారీగా అభ్యర్ధులను వెతుక్కోవడంతో పాటు జిల్లాలో సీనీగ్లామర్‌ను దింపేందుకు రంగం సిద్దం చేస్తోంది .. టీడీపిలో కీలకమైన నేతలను తనవైపు తిప్పుకుని.. అధికారపక్షాన్ని ఢీకొట్టడానికి పక్కా ప్లాన్‌ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.. అన్ని కుదిరితే ఆషాడం ముగిసాక గోడ దూకేందుకు కొందరు నేతలు రెడీగా ఉన్నారంట…

ఏపీలో అధికారమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తోంది బిజెపి … ఒకవైపు వైసిపిని టార్గెట్‌ చేస్తూ .. మరోవైపు టిడిపి నుంచి వలసలు ప్రోత్సహించే పనిలో పడింది .. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలోనూ.. రాజకీయ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్లాన్ వేస్తోంది కమలదళం … సభ్యుత్వనమోదు కార్యక్రమం పేరుతో జిల్లాలో రెండు రోజులు తిరిగేసిన కాషాయనేతలు … సామాజిక వర్గాల వారీగా ఆయా నియోజక వర్గాల్లో ఉన్న ముఖ్యనేతలతో చర్చలు జరిపారు..

బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకూమార్ పీలేరుకు చెందిన ఇంతియాజ్ అహ్మద్ ఇంటికెళ్లి గంటపాటు చర్చలు జరిపాగా.. కన్నా లక్ష్మీనారాయణ చంద్రిగిరిలో పట్టున్న సైకం జయంచంద్రారెడ్డితో ఆయనే ఇంట్లోనే భేటీ అయ్యారు … ఇద్దరు కీలకనేతలు స్వయంగా వెళ్లి వారితో చర్చలు జరపడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది … మైనార్టీ వర్గానికి చెందిన ఇంతియాజ్ అహ్మద్ పీలేరు టిడిపిలో బలమైన నేతగా ఉన్నారు … రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటి చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు … ఆ తర్వాత టికెట్‌ దక్కక పార్టీకి రాజీనామా చేశారు…

ఇక సైకం జయచంద్రారెడ్డి 2009లో ప్రజారాజ్యం తరుపున చంద్రగిరి నుండి పోటీ చేసి ఓడిపోయారు.. ఆ తర్వాత ఎన్నికల్లో టిడిపి టికెట్‌ కోసం విఫలయత్నం చేసి చివరికి సైలెంట్‌ అయ్యారు … అటువంటి నేతల ఇళ్లకు బిజెపి లీడర్లు కొనసాగించిన మంతనాలు ఫలించినట్లే కనిపిస్తున్నాయి .. స్వయంగా ఇంటికొచ్చి ఆహ్వానించడంతో వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం… అయితే ప్రస్తుతం ఆషాడమాసం కావడంలో మంచి ముహూర్తం చూసుకుని కాషాయ కండువా కప్పుకుంటారంట..

ఇక నగరి నియోజవర్గంలో వైసిపి ఎమ్మెల్యే రోజాని ఎదుర్కోవడానికి సినీగ్లామర్‌ను దించడానికి బిజెపి ఫిక్స్‌ అయినట్లు కనిపిస్తోంది … అందులో భాగంగానే సినీ నటి ప్రియారామన్‌ని రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది… తెలుగు వారికి బాగానే పరిచయం ఉన్న హీరోయిన్‌ ప్రియారామన్‌ని నగరిలో రోజాపై పోటికి దింపుతున్నారన్న ప్రచారం జిల్లాల్లో హాట్‌టాపిక్‌గా మారింది .. నగరిలో తమిళ ఓటర్లు గణనీయంగా ఉండటంతో ప్రియారామన్‌ సినీగ్లామర్‌ ప్లస్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారంట బిజెపి పెద్దలు.. ప్రియా రామన్ సైతం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించిన వెంటనే తన వారితో నగరిలో పర్యటించడం విశేషం …

చిత్తూరు జిల్లాపై పూర్తిస్ధాయిలో దృష్టి సారిస్తున్న బిజెపి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది … నేరుగా అగ్రనేతలే ఆయా నియోజకవర్గాల్లో బలమున్న నేతలను ఎంచుకుని మరీ ఇంటివెళ్ళి చర్చలు జరుపుతుండటంపై పొలిటికల్‌గా పెద్ద చర్చే జరుగుతోంది …. ఇక ప్రియారామన్‌ నగరి పర్యటన అందరిలో మరింత ఆసక్తికరంగా తయారైంది.. మరోవైపు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కూమార్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు కిషోర్‌కూమార్‌రెడ్డి కూడా బిజెపిలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.. అయితే వాటిని నల్లారి అనుచరగణం ఖండిస్తోంది … మరి బిజెపి యాక్షన్ ప్లాన్‌ ఇంకెంతమందిని వర్కౌట్‌ చేస్తుందో తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here