Home News Updates

సోము వీర్రాజు కథ కంచికేనా..ఉన్న ఒక్క ఎమ్మెల్సీ పదవి పాయే

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు కష్టకాలం మొదలైనట్లే ఉంది. సోము ఎమ్మెల్సీ పదవి ముగుస్తుండటంతో ఇక ఆయన చట్టసభలో ప్రాతినిధ్యం కోల్పోతున్నారు. వీర్రాజు ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడిగానే ఉంటారు. తిరుపతి ఉపఎన్నిక భారీ పరాజయం నేపథ్యంలో ఇక ఆ పదవి ఎన్నాళ్లుంటుందో తెలీదు. ఇక చట్టసభల్లో మాత్రం వీర్రాజు కు చాన్స్ దక్కే అవకాశం కనిపించడం లేదు. సాధారణ ఎన్నికల్లో ఎలాగు పోటీ చేసి గెలవడం అసాధ్యం ఇక ఎమ్మెల్సీ చాన్స్ అన్నది వైసీపీ పై ఆధారపడి ఉంది.

2014 తర్వాత టీడీపీ పొత్తులో భాగంగా నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఓ రాజ్యసభ సీటు,ఎమ్మెల్సీ పదవిని టీడీపీ ఇచ్చింది. విశాఖ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధిగా మాదవ్ పోటీ చేస్తే టీడీపీ పొత్తుతో ఎమ్మెల్సీ కాగలిగారు. ఇక గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోరపరాజయం పాలైంది. వీర్రాజు పదవి కోల్పోయి మధవ్ ఎమ్మెల్సీ పదవీకాలం ముగిస్తే బీజేపీకి ఇక ఏపీ చట్టసభల్లో స్థానం లేకుండా పోతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నామని గప్పాలు పోవడం తప్ప లోకల్ గా సోము అండ్ బ్యాచ్ సాధించింది ఏమి లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here