Home Entertainment Cinema

మరోసారి పెళ్లికూతురైన అనుష్క

అనుష్క మరోసారి పెళ్లికూతురైంది. ప్రస్తుతం ఈ అమ్మడి వయసు 40 ఏళ్లు. 30లోకి అడుగుపెట్టినప్పటి నుంచి.. దశాబ్దం కాలంగా బొమ్మాళీ పెళ్లి వార్త వినిపిస్తూనే వుంది. నిన్నిటివరకు హీరో.. దర్శకుడితో ముడిపెట్టినవాళ్లు ఈసారి జస్ట్‌ ఫర్‌ ఛేంజ్‌ అన్నట్టు.. బిజినెస్‌మేన్‌తో పెళ్లి చేస్తున్నారు.

ఇంతవరకు పెళ్లిపీటలు ఎక్కని అనుష్కకు చాలాసార్లు పెళ్లి చేసేశారు. ఆమె నటించిన హీరోతో.. లేదంటే దర్శకుడితో ముడిపెట్టేస్తూ వుంటారు. ప్రభాస్‌తో నాలుగు సినిమాలు చేయడంతో… ఇద్దరికీ పెళ్లికాకపోవడంతో… పెళ్లి చేసుకుంటారన్న వార్త చాలాసార్లు తెరపైకి వచ్చింది. జస్ట్‌ఫ్రెండ్స్ మాత్రమే అని ఇద్దరూ ఖండించినా ఈ గాసిప్‌ చల్లబడలేదు. అనుష్క ఆమధ్య సైజ్‌ జీరో మూవీ చేసింది. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి దర్శకుడు. ప్రకాష్‌ కనికాతో విడాకులు తీసుకున్న తర్వాత అనుష్కను పెళ్లి చేసుకుంటాడన్న వార్త వచ్చినా.. అది కూడా పుకారుగానే మిగిలిపోయింది.

ఈసారి అనుష్క కాబోయేవాడు లిస్ట్‌లో సినిమావాళ్లను తీసేసి బిజినెస్‌మేన్ని పెట్టారు. దుబాయ్‌ సెటిలైన యంగ్‌ బిజినెస్‌మేన్‌తో అనుష్క ఏడడుగులు వేస్తోందట. అతని వయసు అనుష్క కంటే తక్కువని ట్రోల్‌ అవుతోంది. అనుష్క సినిమా ఒప్పుకుని మూడేళ్లవుతోంది. నిశ్శబ్దం తర్వాత మరోసినిమా చేయలేదు. యువి క్రియేషన్స్‌ బేనర్‌లో సినిమా చేయనుందంటూ న్యూస్‌ స్ప్రెడ్‌ అయినా.. నిర్మాతలు ఎనౌన్స్‌ చేయలేదు. పెళ్లి కోసమే సినిమాలు మానేసిందా? ఈ పెళ్లి వార్తయినా.. నిజమై.. ఓ ఇంటిదవుతుందా? మొత్తానికి కరోనా సీజన్‌లో అనుష్క పెళ్లి వార్త హాట్‌ టాపిక్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here